మెదక్ నుంచి రాహుల్ పోటీ. – జగ్గారెడ్డి విజ్ఞప్తి!

మెదక్ నుంచి రాహుల్ పోటీ.
– జగ్గారెడ్డి విజ్ఞప్తి!

MLA Jaggareddy

హైదరాబాద్;

రాహుల్ గాంధీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందున ప్రజలు రుణం తీర్చుకుంటారని ఆయన అన్నారు.కేసీఆర్ పోటీ చేసినా రాహుల్ గాంధీ బంపర్ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు.
చంద్రబాబు విజన్ కల్గిన నాయకుడని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.అభివృద్ధి చంద్రబాబుతో నే సాధ్యమని ప్రజలు నమ్మారని వచ్చే ఎన్నికల్లో అదే జరుగుతుందన్నారు.చంద్రబాబు రెండోసారి ఏపీ సీఎం కావడం ఖాయం అని చెప్పారు.
చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ కి మంచిదన్నారు.బాబు రాష్ట్ర నాయకుడు కాదు ..జాతీయ స్థాయి నాయకుడని చెప్పారు. హైదరాబాద్ లో ఐటీ డెవలప్ వెనక చంద్రబాబు ఘనత ఉందన్నారు.ఏపీలో టీడీపీ తెలంగాణాలో కాంగ్రెస్ బతికితేనే ప్రజలకు మంచిదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.