మేం చేతులు ముడుచుకొని లేము .. కేసీఆర్ కు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇస్తాం. – బుద్ధా వెంకన్న వార్నింగ్!!

మేం చేతులు ముడుచుకొని లేము ..
కేసీఆర్ కు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇస్తాం.
– బుద్ధా వెంకన్న వార్నింగ్!!

From amaravathi

మోదీ డైరెక్షన్ లో కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తున్నారంటూ టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కేసీఆర్ తో లాలూచీ పడ్డారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ మోదీ డైరెక్షన్ లో నడుస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహాకూటమి ఏర్పాటును నీరు గార్చేందుకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను తీసుకొచ్చారని విమర్శించారు. ‘ఏపీకి అన్యాయం జరిగినా ఫర్వాలేదు.. నా కేసులు మాఫీ జరిగితే చాలు’ అని జగన్ భావిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ డైరెక్షన్ లో పని చేస్తున్న కేసీఆర్ , జగన్ ముసుగు ఈ రోజు తొలగిపోయిందని వెంకన్న తెలిపారు.’రిటర్న్ గిఫ్ట్’ పేరుతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశరాజకీయాలను ప్రభావితం చేయగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడని వ్యాఖ్యానించారు. జగన్ తెలంగాణలో పోటీ చేయకుండా కేసీఆర్ తో లాలూచీ పడ్డారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నారని బుద్దా వెంకన్న గుర్తుచేశారు.ఇప్పుడు జగన్ వారితో కలవడం ద్వారా ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదన్న సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదని వెంకన్న స్పష్టం చేశారు. తాము అంతకంటే పెద్ద గిఫ్టును 2019లో కేసీఆర్ కు ఇస్తామని హెచ్చరించారు.