రైతులకు నేరుగా నగదు సాయం!!

రైతులకు నేరుగా నగదు సాయం!!

-కేంద్ర ప్రభుత్వ ఆలోచన.

న్యూఢిల్లీ:

మరికొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరో ప్రజాకర్షక పథకం ప్రకటించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైతులకు సబ్సిడీలు ఇవ్వడానికి బదులు వారికి భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులేస్తున్నట్టు న్యూస్ వైర్ బ్లూమ్ బర్గ్ తెలిపింది. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని చక్కదిద్దేందుకు వారికి నేరుగా నగదు అందిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయం కోసం ఇస్తున్న అన్ని సబ్సిడీలను ఒకటిగా చేసి వాటికి బదులు నగదు సాయం అందించనున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిందని ఏజెన్సీ పేర్కొంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఖజానా నుంచి ఏటా రూ.70,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రైతులకు ఇచ్చే సబ్సిడీ కోసం బడ్జెట్ లో రూ.70,100 కోట్లు కేటాయించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఖజానా లోటు బడ్జెట్ లక్ష్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే దాటేసింది. అలాంటి పరిస్థితిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు పెంచుకొనే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అదనపు ఖర్చుతో ప్రభుత్వ ఖజానా పరిస్థితిపై ఎలాంటి ప్రభావం ఉండను. రూపాయి, బాండ్లు బలపడినందువల్ల ప్రభుత్వానికి సహాయకారిగా మారతాయి.