జనం నిల్.. సభలు డల్!!

న్యూఢిల్లీ:

సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. కానీ కొన్నాళ్లుగా బీజేపీ శ్రేణుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతల ర్యాలీలు, సభలకు ఇంతకు ముందులా జనం భారీగా రావడం లేదు. ఇటీవల రాజస్థాన్ లోని అజ్మీర్ లో ప్రధాని మోడీ జరిపిన ర్యాలీకి హాజరైన జనాన్ని చూసిన కమల దళంలో కలవరం కలుగుతోంది. ముందుగా 3 లక్షల మందిని తీసుకొస్తామని రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ గొప్పలు చెప్పినా వచ్చిన జనాలు అందులో సగం కూడా లేరని పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తన మ్యాజిక్ తో బీజేపీ ప్రభంజనం సృష్టించిన మోడీ సభలకే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే వచ్చే ఎన్నికలు గట్టెక్కేదెలాగని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు.