మోడీకి వచ్చిన బహుమతుల వేలం.

మోడీకి వచ్చిన బహుమతుల వేలం.

modi mementos

న్యూఢిల్లీ:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశవిదేశాల్లో పర్యటించినపుడు ఎన్నో రకాల బహుమతులు, జ్ఞాపికలు లభిస్తాయి. ఈ జ్ఞాపికలను విదేశాంగ మంత్రిత్వశాఖ ట్రెజరీలో జమ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ఈ మొమెంటోలను కొనుగోలు చేయవచ్చు. ఒక ముఖ్యమైన లక్ష్యం కోసం ప్రభుత్వం ఈ జ్ఞాపికలను అమ్మేయాలని నిర్ణయించింది. ‘క్లీన్ గంగ’ ప్రాజెక్ట్ కోసం ఈ అమ్మకాల ద్వారా వచ్చిన నిధులను ఉపయోగిస్తారు. ఈ స్మృతి చిహ్నాలను ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం.27, 28 జనవరిన వేలంపాట.
ప్రభుత్వ నుంచి అందిన సమాచారం మేరకు ప్రధానమంత్రికి వచ్చిన స్మృతి చిహ్నాలను అమ్మేందుకు ఒక వేలంపాటను ఏర్పాటు చేస్తారు. ఈ వేలంపాట 27, 28 జనవరిన జరుగుతుంది. ఈ వేలంపాటలో పాల్గొనేందుకు నేషనల్ మోడరన్ ఆర్ట్ మ్యూజియంకి వెళ్లాల్సి ఉంటుంది. వేలంపాట మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇవే కాకుండా 29-31 జనవరి వరకు మీరు ఈ-వేలంపాట ద్వారా పీఎంకి లభించిన జ్ఞాపికలను వేలం పాడవచ్చు. ఈ-వేలంపాట https://pmmementos.gov.in పోర్టల్ లో జరుగుతుంది.