‘నాగం’కుమారుడు మృతి.

హైదరాబాద్:
నాగం జనార్దన్ రెడ్డి పెద్ద కుమారుడు దినకర్ రెడ్డి గురువారం రాత్రి మరణించారు.గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న దినకర్. దినకర్ రెడ్డి కి రెండు రోజులుగా వెంటిలేటర్ చికిత్స అందిస్తున్న వైద్యులు.జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతిచెందిన దినకర్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు నాయకులు అపోలో కు చేరుకొని నాగం ను పరామర్శించారు.
దినకర్ 46 సంవత్సరాల వయస్సులోనే చనిపోవడం నాగం కుటుంబానికి తీరని లోటని చిన్నారెడ్డి పేర్కొన్నారు.పార్టీ తరపున నాగం జనార్దన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.ప్రొఫెసర్ కోదండ రామ్ తో పాటు జనసమితి పార్టీ నాయకులు కూడా నాగం ను పరామర్శించారు.