వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక

న్యూఢిల్లీ:

వారం రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్యూసీ) కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామాకు కట్టుబడి ఉన్నానని మరోమారు స్పష్టంచేశారు. ఎలాంటి జాప్యం లేకుండ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని తెలిపారు.లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన మే 25న పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు ఎన్ని రకాలుగా విజ్ఞప్తులు, వత్తిళ్లు తెచ్చిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 543 సీట్లలో కేవలం 52 చోట్లే విజయం సాధించింది.సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులు కాకుండా మూడో సారీ బయటి వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారు.