ఎన్ఐఏ అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్!!

ఎన్ఐఏ అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్!!

విజయవాడ:

ఎన్ఐఏ అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను శ్రీనివాసరావు అనే న్యాయవాది వేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావును న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలన్న కోర్టు ఆదేశాలను ఎన్‌ఐఏ అధికారులు ధిక్కరించారని పేర్కొంటూ లాయర్ ఈ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను స్వీకరించిన ఎన్‌ఐఏ కోర్టు విచారించనుంది.మరోవైపు సిట్ పోలీసులపై ఎన్ఐఏ అధికారులు వేసిన పిటిషన్‌పై సెషన్స్ కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది.
వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి కేసులో ఏపీ పోలీసులు తమకు సహకరించడం లేదని, కేసుకి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలంటూ ఎన్ఐఏ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.