‘విశ్వనగరం’ లో టెర్రరిస్టులు. పాతబస్తీలో ‘ఐసిస్’?

ఎన్ ఐ ఏ బృందాలు ఏకకాలంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు జరిపాయి. హైదరాబాద్‌ పాతబస్తీలోని షాహీన్‌నగర్‌, పహడీషరీఫ్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. షాహీన్‌నగర్‌కు చెందిన మొహమ్మద్‌ అబ్దుల్ ఖుద్దూస్ అనే వ్యక్తి ఇంట్లో ఎన్‌ఐఏ పోలీసులు తనిఖీలు చేశారు. అతని కుమారుడైన పందోమ్మిదేళ్ల వయస్సున్న అబ్దుల్ ఖధీర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఖధీర్‌కు సంబంధించిన మొబైల్‌ ఫోన్, ఓ ల్యాప్‌టాప్‌ను ఎన్‌ఐఏ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. తండ్రి కొడుకులిద్దరూ విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని చెప్పినట్లు అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. అధికారుల తనిఖీల సందర్భంగా పహాడీషరీఫ్, బాలాపూర్‌ ఠాణాలకు చెందిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలో 2016లో నమోదైన ఒక కేసులో అనుమానితులు ఇక్కడ తలదాచుకుంటున్నారన్న అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు.

ఎస్.కె.జకీర్.

ఇండియాను టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించాలనుకున్న ‘ ఐసిస్’ కుట్రలను ‘ఎన్.ఐ.ఏ’. భగ్నం చేసింది. ‘ఇస్లామిక్’ రాజ్య స్థాపన పేరిట ఏర్పడిన ‘ఐసిస్’ మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ కనుగొన్నది. ఐసిస్ సానుభూతిపరులను సోమవారం అరెస్ట్ చేశారు. ఎన్ ఐ ఏ బృందాలు ఏకకాలంలో గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు జరిపాయి. హైదరాబాద్‌ పాతబస్తీలోని షాహీన్‌నగర్‌, పహడీషరీఫ్‌లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. షాహీన్‌నగర్‌కు చెందిన మొహమ్మద్‌ అబ్దుల్ ఖుద్దూస్ అనే వ్యక్తి ఇంట్లో ఎన్‌ఐఏ పోలీసులు తనిఖీలు చేశారు. అతని కుమారుడైన పందోమ్మిదేళ్ల వయస్సున్న అబ్దుల్ ఖధీర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఖధీర్‌కు సంబంధించిన మొబైల్‌ ఫోన్, ఓ ల్యాప్‌టాప్‌ను ఎన్‌ఐఏ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. తండ్రి కొడుకులిద్దరూ విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని చెప్పినట్లు అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు.

అధికారుల తనిఖీల సందర్భంగా పహాడీషరీఫ్, బాలాపూర్‌ ఠాణాలకు చెందిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిల్లీలో 2016లో నమోదైన ఒక కేసులో అనుమానితులు ఇక్కడ తలదాచుకుంటున్నారన్న అనుమానంతో ఈ సోదాలు చేపట్టారు.2016 అబుదాబి లో అరెస్ట్ అయిన ముగ్గురి సానుభూతి పరులను విచారించగా తమిళనాడు నుంచి 8 మంది , తెలంగాణ నుంచి ఒక్కరు సిరియాకు వెళ్లారని తెలిపారు. దీంతో ఢిల్లీ ఎన్.ఐ.ఏ. అధికారులు 9 మంది నిందితులపై అప్పట్లో కేసు నమోదు చేసింది. ఐ.పి.సి. 120బి,యూఏ యాక్ట్. 17,18,18బి, 20,38,39,40 సెక్షన్స్ పై కేసులు నమోదు చేశారు. ఐసిస్ కు అకర్షితులైన జాబితా ఎన్.ఐ.ఏ వద్ద ఉంది. ఎవరెవరు పరారయ్యారు? వారి బందువులు ఎవరు? ఎవరి వలన అకర్షితులు అయ్యారు? అనే అంశాలన్నింటిని ఎన్.ఐ.ఏ. పరిశీలిస్తుంది. కేసు నమోదు చేసి విదేశాలకు పారిపోయిన ఉగ్రవాదుల మూలాలను వెతుకుతోంది.వివిధ రంగాల్లో నిఫుణులుగా ఉన్న ఓ’ వర్గానికి’ చెందిన యువతకు ఐ.సి.సి. వల వేస్తున్నట్టు ఎన్.ఐ.ఏ గుర్తించింది. ఐసిస్ ఉగ్రవాదుల కార్యకాలపాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు ఎన్.ఐ.ఏ. కూడా తన నెట్ వర్క్ ను విస్తరించుకున్నది. ఐ.ఎస్.ఐ.ఎస్.లో చేరేందుకు విదేశాలకు వెళ్లిన వారిని పట్టుకోవడంలో బలం పెంచుకుంది. సానుభూతి పరులను విచారించి కీలక సమాచారం రాబడుతున్నది. హావాల రూపంలో డబ్బులు ఇండియాకు పంపించి ఇక్కడ వారి కుటుంబాలను అదుకుంటున్నామని హామి ఇవ్వడంతో చాల మంది ‘ఐసిస్’ కార్యకాలపాలకు అకర్షితులు అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇండియాలో ఐసిస్ మూలాలను పెకిలించడానికి ఎన్ ఐ ఏ ప్రయత్నిస్తున్నది. ఉగ్రవాదులు వాడుతున్న ‘బాష’ను, ‘వెబ్ సైట్ల’ పై ఎన్.ఐ.ఏ. అధికారులు నిఘా పెంచారు. కోడింగ్ ‘భాష’ ను ‘డికోడింగ్’ చేస్తున్నారు. ఇండియాలో సానుభూతిపరులుగా, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రెరేపిస్తున్నారో గుర్తిస్తున్నారు. భయటి ప్రపంచానికి అమాయకులుగా, ఎంతో మంచి వారుగా కనిపిస్తూ ‘ఐసిస్’ కు మద్దతుదారులుగా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది.పాత బస్తీలో గతంలో పట్టుపడ్డ ‘ఐసిస్’ ఉగ్రవాదులు మహ్మద్‌ ఇబ్రహీం,ఇల్యాస్‌ యజ్దానీ బ్రదర్స్ కుటుంబం తలాబ్‌కట్టలో ఉంటోంది. వీరి తండ్రి 1998లో,2009లో చనిపోయారు. ఇబ్రహీం, ఇల్యాస్‌తోపాటు మరో ముగ్గురు సోదరులున్నారు. ఈ అయిదుగురిలో ఇబ్రహీం రెండోవాడు.

ఇలియాస్ చివరివాడు.2008లో వికారాబాద్‌ అన్వర్‌ ఉల్‌ ఉలుం కళాశాలలో ఇబ్రహిం బీటెక్‌ ఈ.ఈ.ఈ పూర్తి చేశాడు. 2013లో పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల కొడుకున్నాడు. కొంతకాలంపాటు ‘అమెజాన్‌’, ‘ఫ్లిప్‌కార్ట్‌’ సంస్థల్లో కూడా పనిచేశాడు. 2008 నుంచి దుబాయ్‌, సౌదీ తదితర దేశాలకు ‘విజిట్‌ వీసా’పై వెళ్లాడు. అక్కడే కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన షఫీఆర్మర్‌తో ‘ఆన్‌లైన్‌’ లో పరిచయం అయ్యాడు. తనతో పాటు చిన్న సోదరుడు ఇల్యాస్‌ సైతం ఉగ్రవాద బాటలో నడిచేలా తయారుచేసినట్టు ఎన్ ఐ ఏ అధికార వర్గాలు తెలిపాయి. . ఇంటర్‌ చదివిన ఇలియాన్ ‘మీ సేవ’ కేంద్రం నిర్వహిస్తూ ఉండేవాడు. ‘విధ్వంసం కుట్ర’ కేసులో మరో నిందితుడు ముజఫర్‌ హుస్సేన్‌ రిజ్వాన్‌ ది మరో విషాదగాథ. ఎనిమిదో తరగతి వరకు ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో చదివాడు. ఇరవయేళ్లపాటు లక్కడ్‌కోట్‌ చత్తాబజార్‌లో ఉన్న రిజ్వాన్‌ అయిదేళ్ల నుంచి తలాబ్‌కట్టలోని యజ్దానీ సోదరుల ఇంట్లో అద్దెకుంటూ చత్తాబజార్‌లో చెప్పుల దుకాణంలో పని చేస్తున్నాడు. అయేషాబేగంను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సంబరం తీరకముందే కుట్ర కేసులో ఇరుక్కున్నాడు. యజ్దానీల ఇంట్లో అద్దెకుండటంతో ఇబ్రహిం వారిని అకర్షితులుగా మార్చాడని పోలీసుల విచారణలో తెలింది.ఇబ్రహిం పన్నిన వలలో అమాయకులుగా ఉన్న వారు ఒక్కసారిగా టెర్రరిస్టులుగా మారారు. పేలుళ్ల కుట్ర కేసులో నిందితులుగా జైలు పాలయ్యారు. అయితే వీరి అమాయకత్వం చూసి న్యాయ సహాయం అందించేందుకు మజ్లిస్ పార్టీ ముందుకొచ్చింది. ఇబ్రహీంతో పాటు నలుగురు నిందితులు ఫోన్లో వాడిన ‘కోడ్ బాష’ తో దర్యాప్తు సంస్థలు నివ్వెరబోయాయి.

హైదరాబాద్ లో కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసుల అప్రమత్తతో రెండేళ్ల క్రితం ‘పెను ప్రమాదం’ తప్పింది. హైదరాబాద్ లో వరస బాంబులు పేల్చి ప్రపంచ దేశాలన్నింటో తన ఉనికిని చాటుకోవాలనుకున్న ‘ఐఎస్ఐఎస్’ నుంచి ఎన్.ఐ.ఏ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.ఆర్ధికంగా బలపడేందుకు ఎక్కడ నుంచి హావాల రూపంలో డబ్బులు వచ్చాయో విచారణలో వెల్లడయ్యింది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చిన డబ్బుల పై కూపీ లాగారు. బ్యాంకు ఆకౌంట్లు ఎవరి పేరు మీద తీశారో ఆరా తీసి తలాబ్ కట్టలోని బ్యాంకు అధికారులను విచారణ జరిపారు. 2016 జూలై 3న కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నాందెడ్ నుంచి 9 ఎం.ఎం. పిస్తోల్ ఎలా తీసుకొచ్చారు. అక్కడ ఏవరెవరు సహాకరించారు. అనే కోణంలో అక్కడికి ప్రదాన నిందుతుడు ఇబ్రహింను తీసుకెళ్లి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.జూలై 4,న నాందేడ్ విచారణతో హైదరాబాద్ లో ని ఇబ్రహిం, ఇలియాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మరో 17 బుల్లెట్లను 2 కంప్యూటర్లును , రెండు స్కానర్లను స్వాదీనం చేసుకున్నారు. జూలై 5న నిందితులు వాడిన ‘నెట్ వర్క్’ పై, అండర్ గ్రౌండ్ హాకింగ్ పై దృష్టి పెట్టారు. నిఘా వర్గాల కంట పడకుండా ఎలా ‘సమాచార మాద్యమాలు’ వాడుకున్నారో, వారికి సహాకరించిన ఐ.టి. నిపుణులెవరో ఎన్ ఐ ఏ కనుగొన్నది. జూలై 6న ఎన్.ఐ.ఏ. టీం అనంతపూర్ కు వెళ్లింది. నంది లాడ్జి లో ఎవరెవరిని కలిశారో విచారణలో రాబట్టింది. ‘మీ సేవా’ కేంద్రం నుంచి మరోక్కరి పేరుతో ఐ.డీ. ప్రూప్ సమర్పించి ఆ లాడ్జిలో స్థావరం పొందారు. అక్కడ పేలుడు పదార్ధాలు సేకరించినట్లు సమాచారం ఎన్ ఐ ఏ సేకరించింది.

జూలై 8 న నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిజామోద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను సాంకేతికంగా సహకరించినట్లు తేలింది. 2016 వరకు దేశవ్యాప్తంగా చిక్కిన 30 మంది ఐసిస్ సానుభూతిపరులు, అనుమానితులు తమతో సంప్రదింపులు జరిపిన వ్యక్తి ‘యూసుఫ్ అల్ హింద్’ అని చెప్పారు. అతను ‘షఫీ ఆర్మర్’ అని ఎన్.ఐ.ఏ. భావిస్తుంది. ఇబ్రహీం సైతం తాను ఆరు నెలల్లో అనేకసార్లు ఈ ‘అల్ హింద్‌’తో, నాలుగైదుసార్లు ఐసిస్ అధినేత ‘అబు బకర్ అల్‌బాగ్దాదీ’గా చెప్పుకున్న వ్య క్తితో సంప్రదింపులు జరిపానని ఎన్ ఐ ఏ కు తెలిపాడు.షఫీ ఆర్మర్ ‘సిరియా’ నుంచే వీరిని కాంటాక్ట్ చేసినట్లు దర్యాప్తు సంస్థ నిర్ధారించుకున్నది. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ మహ్మద్‌, మహ్మద్‌ ఇలియాస్‌ యజ్దానీ, అబ్దుల్ బిన్‌ అహ్మద్ అల్‌ అమోదీ, ముజ్ఫుర్ హుస్సేన్‌ రిజ్వాన్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఎన్.ఐ.ఏ ఐసిస్ ఉగ్రవాదుల పై విచారణ మరింత ముమ్మరం చేసింది.

హైదరాబాద్ మూలాల పై స్పష్టత వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడేక్కడ ఐసిస్ మాడ్యూల్స్ ఉన్నారని దృష్టి పెట్టింది ఐసిస్ మాడ్యూల్ కు హైదరాబాద్ ఇంచార్జీగా ఇబ్రహీం యజ్దాని వ్యవహారించాడని ఎన్.ఐ.ఏ. తెల్చింది. రెహామన్ అనే నిందితునికి ‘ఖురాన్’ పై మంచి పట్టు ఉన్నది. పవిత్ర గ్రందం నుంచి కొన్ని సూక్తులను తీసుకోని మతం కోసం పని చేస్తే ఎలాంటి పుణ్యం కల్గుతుందో అతను నూరిపోసేవారు. ‘జీహాద్ ‘ కోసం ఎంత మందిని చంపినా పర్వాలేదని ఐసీస్ కు పనిచేసేలా ప్రేరేపించాడని ఏన్.ఐ.ఏ తెలిపింది. ఇలాంటి రెహామన్ గతంలో ఎక్కడెక్కడ పని చేశాడు? ఏవరెవరని అకర్షితులుగా మార్చారు? ఎన్ని ‘మాడ్యూల్స్’ దేశంలో పాగా వేశాయి? అనే అంశాలను తేల్చడానికి ఢిల్లీకి తీసుకువెళ్లారు. వికారాబాద్, పోచంపల్లి, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకూ తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. ఎన్‌క్రిప్టెడ్ ఈ-మెయిల్స్, డార్క్ వెబ్ వంటి అప్లికేషన్స్ వాడటంతో ఇబ్రహీం యజ్దానీ హ్యాండ్లర్‌తో సంప్రదింపులు జరిపారు. తూటానోటా అనే సోషల్‌మీడియాను వాడారు.

ఐసిస్ వీడియోలు, మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు సొంత కంప్యూటర్లు కాకుండా సైబర్ కేఫ్‌లను వాడారు.’ ఖలీఫా’గా ప్రకటించుకున్న ‘ఐసిస్’ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీకి బద్ధులమై ఉంటామంటూ చేసిన ‘ప్రమాణ పత్రాలను’ ఎన్.ఐ.ఏ స్వాదీనం చేసుకుంది. ప్రమాణం పూర్తయిన తర్వాత తమ స్థోమతకు తగ్గట్టు నిధులు విరాళాలు ఇచ్చారు. ఎవరు ఎంత మొత్తం వేస్తున్నారనేది మరొకరికి తెలియకుండా జోలెలో పడేశారు. మొత్తం 1.5 లక్షలు వచ్చాయి. వీటితో కొన్ని పేలుడు పదార్దాలు కోనుగోలు చేశారు.దేశంలో రోజురోజుకు ఐసిస్ ఉగ్రవాదానికి అకర్షితులు అవుతున్న యువతకు చెక్ పేట్టేందుకు ఎన్.ఐ.ఏ, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.