మోదీకి ఏపీ సర్కార్‌ క్రెడిట్‌ ఇవ్వడంలేదు. గడ్కరీ:

మోదీకి ఏపీ సర్కార్‌ క్రెడిట్‌ ఇవ్వడంలేదు.
గడ్కరీ:
null

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత చేసినా ఏపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్రెడిట్‌ ఇవ్వడంలేదని బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, నాలుగున్నరేళ్లలో మోదీ సర్కార్‌ ఏపీకి ఎంతో చేసిందన్నారు. ఏపీకి కేంద్రం చేసిన సహాయం గురించి ఆయన వివరించారు.పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవధార అని, అలాంటి ఆ ప్రాజెక్టుకు 100 శాతం నిధులు ఇస్తున్నామని గడ్కరీ పేర్కన్నారు. ఏపీలో జాతీయ రహదారులు పెద్ద ఎత్తున విస్తరించామన్నారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పోర్టుల కోసం రూ.1.64 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఏపీ చరిత్రలో ఇదో స్వర్ణయుగమని నితిన్‌ గడ్కరీ అభివర్ణించారు.