సర్పంచ్ అభ్యర్థి పేరు గల్లంతు పోలింగ్ నిలిపివేత.

సర్పంచ్ అభ్యర్థి పేరు గల్లంతు
పోలింగ్ నిలిపివేత.

మంచిర్యాల:

కన్నేపల్లి మండలం జజ్జరెల్లిలో సర్పంచ్ అభ్యర్థి పేరు గల్లంతు కావడంతో పోలింగ్‌ నిలిచిపోయింది.బ్యాలెట్‌ పేపర్ లో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఆరుగురు అభ్యర్థులలో ఒక అభ్యర్థి పేరు లేదు. దీంతో గ్రామస్థుల ఆందోళనకు దిగారు. పోలింగ్ నిలిపివేశారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు సోమవారం జరిగాయి.