‘ఆపరేషన్ అసమ్మతి’ చలో ఢిల్లీ!!

Congress

హైదరాబాద్:

సీట్లు రాని వారిని కాంగ్రెస్ డిల్లీకి పిలిచింది. బుజ్జ‌గింపుల కోసం అధిష్టానం ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తుంది.వార్ రూమ్ లో చర్చల కోసం ఢిల్లీ నుంచి పిలుపు రానుంది.అసమ్మతి నాయకుల పేర్లు సిద్దం చేయాల‌ని ఎఐసిసి కార్య‌ద‌ర్శుల‌కు సూచ‌న.రెండు రోజ‌ల‌లో డిల్లీకి వెళ్ళ‌నున్న నేత‌లు.నామినేష‌న్ల కంటే ముందే నేత‌ల‌కు బుజ్జిగింపులు.డిల్లీ నుంచి టీపీసీసీ కోశాధికారి గూడురుకు పిలుపు వచ్చింది.టిక్కెట్లు రాని ఆశావాహుల‌కు అధిష్టాణం నుంచి పిలుపు రానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 119 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి దాదాపు 5 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే అందులో పొత్తులో దాదాపు 25 సీట్లు పోటీ చేసే అవ‌కాశం లేకుండా పోవ‌డం, చాల సీట్లలో సామాజిక కోణం నేప‌థ్యంలో ముఖ్యులు సీట్లు కోల్పోవ‌డంతోపాటు, నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు ముగ్గ‌రు ముఖ్య నాయ‌కులు టిక్కెట్ కోసం పోటీ ప‌డుతుండ‌డంతో కాంగ్రెస్ సీట్ల ఏర్పాట్లు చాల క్లిష్టంగా మారింది. దాదాపు సీట్ల కేటాయింపులు కీల‌క ద‌శ‌గా చేరిన నేప‌థ్యంలో సీట్లు రాని నాయ‌కులు, పొత్తుల‌లో సీట్లు కోల్పోయిన నాయ‌కులు రెబ‌ల్‌గా పోటీలు చేయ‌కుండా, అసంతృప్తితో ఎలాంటి రాజ‌కీయ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కుండా ఉండేందుకు ముందుగానే నాయ‌కుల‌ను బుజ్జిగించి వారిని పార్టీకి ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకునేందుకు అధిష్టాణం చ‌ర్య‌ల‌కు సిద్దం చేసింది. ఇందుకోసం టిపిసిసి కోశాధికారి, సీనియ‌ర్ నాయ‌కులు గూడూరు నారాయ‌ణ రెడ్డిని డిల్లీకి ర‌మ్మ‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్య‌వ‌హ‌రాలు చూస్తున్న డిల్లీలోని టిపిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఒక‌రు, ఎఐసిసి వ్య‌వ‌హారాలు చూస్తున్న ముగ్గురు కార్య‌ద‌ర్శుల‌కు ఫోన్ ద్వారా స‌మాచారం ఇచ్చి వారు ఇంచార్జ్‌లుగా బాధ్య‌తలు చూస్తున్న వారి ప్రాంతాల‌లోని అసెంబ్లీ స్థానాల‌లో పేర్ల‌ను ప‌రిశీలించి సిఫార‌సు చేయాల‌ని సూచించారు. కాగా ముగ్గ‌రు ఎఐసిసి కార్య‌ద‌ర్శులు వారి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న లీస్టుల ఆదారంగా, స‌ర్వేల ఆదారంగా టిక్కెట్ కేటాయించిన నాయ‌కుడు కాకుండా రెండో స్థానంలో ఉండే నాయ‌కుల‌ను లీస్టుల‌ను సిద్దం చేసి పంప‌నున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్, ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి కుంతియా తో సంప్రదించి ఖచిత్తమైన సమాచారం ఏఐసీసీ కి పంపుతారు.. దాని ఆధారంగా వార్ రూంలో నేతలతో ఏఐసీసీ ముఖ్య నాయకులు భేటి అయ్యి వాళ్లకు హామీలు ఇస్తారు.

ఈ లీస్టుల ఆదారంగా ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ముఖ్య బాధ్య‌త‌ల‌లో ఉన్న నాయ‌కులు వీరంద‌రిని రెండు రోజుల‌లో డిల్లీకి పిలువ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఎలాంటి ప‌రిస్థితుల‌లో వారికి టిక్కెట్ ఇవ్వ‌లేక‌పోయామో, ఎలాంటి ప‌రిస్థితుల‌లో పొత్తు పెట్టుకోవాల్సి వ‌చ్చిందో చెప్పి, భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం రాగానే ఎలాంటి ప‌దువులు ఇవ్వ‌నున్నారో, పార్టీలో ఎలాంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారో వారికి వివ‌రించి, పార్టీ అభ్య‌ర్థి విజ‌యానికి కృషి చేయాల‌ని కోర‌నున్నారు. ఎన్నిక‌ల‌లో రెబెల్స్‌, అసంతృప్తి వాదుల‌తో పార్టీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా, పార్టీ విజ‌యాల‌కు ఇబ్బందులు కాకుండా ఎఐసిసి చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయ‌ని పార్టీ భావిస్తుంది.