రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారా!!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారా!!

– రత్నకుమార్.ఎం.డి.

రేపటి ఎన్నికల్లో ..ఇప్పుడున్న 280సీట్లలో ఒక్కటి తగ్గినా మోడీకి 2014నాటి ప్రజామోదం, ఆదరణ లేనట్టే లెక్క! ఎన్నికల తర్వాత పొత్తులో ‘సైద్ధాంతిక నిబద్ధత’ కన్పిస్తుందా అంటే అనుమానమే. భారత్ అస్థిత్వాన్నీ ధీరత్వాన్నీ సమగ్రతనూ ఎవరు తూలనాడినా ఒంటిమీద తేళ్ళూ జెర్రులూ పాకిన ఫీలింగ్స్ తెచ్చుకుని విరుచుకుపడే భాజపా..కాశ్మీర్ లో వేర్పాటువాదాన్ని సమర్థించే పీడీపీతో జతకట్టి అధికారాన్ని అనుభవిస్తుందని ఎవరైనా కలగన్నారా? అదే కాశ్మీర్ గడ్డపై అనుమానాస్పద స్థితిలో అసువులు బాసిన జనసంఘ్ సిద్ధాంతకర్త మనోభావాల్ని సైతం పట్టించుకోకుండా తొలిసారి అధికారం కోసం వెంపర్లాడిన పరిణామం దేశప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తుంది? రేపటి ఎన్నికల తర్వాత అదే అధికారం కోసం ..నేటి రాజకీయ శత్రువుల్ని కౌగిలించుకోరన్న గ్యారంటీ ఉందా? రానున్న ఎన్నికల్లో ఎవరిని రాజకీయ శత్రువులుగా భావించి పోరాటం చేస్తారో ..వారితో తదుపరి ఐదేళ్ళపాటు శత్రుత్వం కొనసాగిస్తారా? లేక ఎన్నికల తదుపరి అవసరాల కోసం దగ్గరకు తీస్తారా? అన్నది సదరు ‘కర్తలు’ మాత్రమే చెప్పగలరు!