ప్రశాంతంగా ఎన్నికలు. – ఎస్పీ రమా రాజేశ్వరి.

ప్రశాంతంగా ఎన్నికలు.
– ఎస్పీ రమా రాజేశ్వరి.
palamuru local body elections

మహబూబ్ నగర్:

ఎన్నికల సందర్భంగా ప్రజలు స్నేహపూరిత వాతావరణంలో పోటీ పడాలని, గొడవల వలన సాధారణ ప్రజల జీవితాలు చితికిపోతాయన్న విషయం గుర్తించాలని జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి అన్నారు. పల్లె వాతావరణం అత్యంత విశిష్టమైనదని, కాపాడుకొనవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉన్నదని అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పోలీసు బలగాలు గ్రామాలకు చేరుకున్నాయని, అధికారుల నేతృత్వంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎస్.పి. మాట్లాడుతూ, చట్టాన్ని అతిక్రమించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ముఖ్యంగా గొడవలు సృష్టించే వ్యక్తులపై తమ దృష్టి ఉన్నదని పేర్కొన్నారు. శాంతికాముకులైన జిల్లా ప్రజలు పోలీసు శాఖ పట్ల ఎంతో స్నేహంతో, నమ్మకంతో ఉంటారని, శాంతిభద్రతల సమస్య ఏర్పడితే, స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని, వెంటనే మీ పోలీసు స్పందిస్తారని భరోసా ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి నిఘా ఉంటుందని, అతిగా ప్రవర్తించేవారిపై కేసులు నమోదు చేసి కోర్టులో నిలబడతామని అన్నారు. శాంతియుత వాతావరణం కొరకై ప్రజలందరూ పోలీసుకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్.పి. పిలుపునిచ్చారు.