పంచాయతీ ఆర్డినెన్స్ పై పిటిషన్ కొట్టివేత.

పంచాయతీ ఆర్డినెన్స్ పై పిటిషన్ కొట్టివేత.

panchayati ordinance
న్యూఢిల్లీ:

పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన ఆర్‌. కృష్ణయ్య. గ్రామ పంచాయతీ బిసి రిజర్వేషన్లను 34% నుంచి 22%కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ రద్దు చేయాలని కోరిన ఆర్‌. కృష్ణయ్య.
రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
50 శాతం నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమన్న ధర్మాసనం.