ఇక ‘పతంజలి’ దుస్తులు!!

Patanji
న్యూఢిల్లీ:

తమ ఉత్పత్తులతో బహుళజాతి కంపెనీలకు ధీటుగా పోటీనిస్తున్న పతంజలి కొత్తగా వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. యువతను ఆకట్టుకొనే జీన్స్, టీషర్ట్స్ ని ప్రవేశపెట్టింది. రూ.7,000 విలువైన 1 జీన్స్, 2 టీ షర్టులను పతంజలి పరిధన్ కేవలం రూ.1,100కే అందిస్తోందని బాబా రాందేవ్ ట్వీట్ చేశారు. బహుళజాతి సంస్థల దోపిడీని అడ్డుకొనేందుకు స్వదేశీ ఉద్యమంలో కలిసి రావాలని ఆయన కోరారు.

బాబా రాందేవ్ ట్వీట్ కి నటుడు సిద్ధార్థ్ పంచ్ వేశాడు. రూ.7,000 విలువైనవి రూ.1,100కా? అవి రూ.7,000 విలువైనవి ఎందుకు? ఎవరు ఎవరిని దోస్తున్నారు? గందరగోళంగా ఉండే ఆర్థిక శాస్త్రం ఇప్పుడు చాలా సులువైందని రాందేవ్ ట్వీట్ కి రిటార్ట్ ఇచ్చాడు.