‘ జనసేన ‘కు విరాళమిచ్చిన పవన్ తల్లి!!

హైదరాబాద్:

హైదరాబాద్‌లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి వచ్చారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన తన మాతృమూర్తికి పవన్ పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అంజనాదేవి గంటసేపు జనసేన కార్యాలయంలో గడిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి అంజనాదేవి తన వంతుగా రూ.4 లక్షల విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన తల్లి పాదాలను తాకి ఆమె ఆశీస్సులను పొందారు. అనంతరం తన తల్లితో కాసేపు ముచ్చటించిన పవన్.. దగ్గరుండి ఆమెను కారెక్కించి ఇంటికి సాగనంపారు