మహాకూటమి మోడీకి వ్యతిరేకం కాదు, దేశప్రజలకు వ్యతిరేకం

మహాకూటమి మోడీకి వ్యతిరేకం కాదు, దేశప్రజలకు వ్యతిరేకం

PM in Silvassa

ప్రధానమంత్రి నరేంద్ర మోడ శనివారం మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి గుజరాత్ లోని సిల్వసాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగసభలో మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటు కేవలం మోడీకి వ్యతిరేకంగా కాదని, దేశ ప్రజలకు వ్యతిరేకంగానని ఆరోపించారు. కొందరు తమను రక్షించుకొనేందుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. తాను మాత్రం దేశాన్ని ప్రగతి పథాన నడిపేందుకు సబ్ కా సాథ్-సబ్ కా వికాస్ మంత్రంతో నడుస్తున్నానని మోడీ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోడీ పరోక్షంగా విమర్శించారు. మా ప్రభుత్వం పేరుకి బదులు పనిపై దృష్టి పెట్టిందని చెప్పారు. నిజాయితీగా దేశాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఒక కుటుంబం అభివృద్ధి కోసం కాదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తను వేస్తున్న అడుగులు కొందరికి భయం పుట్టిస్తున్నాయని చెప్పారు. దేశ ప్రజల సొమ్ముని దోచుకోకుండా తాను అడ్డుపడినందువల్ల వాళ్లకి కోపం రావడం సహజమేనని అన్నారు.

‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం బాలలకు విద్య, యువతకు ఉపాధి, వృద్ధులకు ఆరోగ్యం, రైతులకు సాగునీరు, ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఇవే అభివృద్ధికి తాము ఎంచుకున్న రాజమార్గాలని వివరించారు.