భారత ప్రధానిగా కేసీఆర్!

భారత ప్రధానిగా కేసీఆర్!

zakeer.sk:

లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలో ‘ఫెడరల్ ఫ్రంట్’ నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చునని రాజకీయపరిశీలకులుభావిస్తున్నారు. అలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడుతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి రేసులో ఉండేఅవకాశం ఉన్నట్టు ఒక అంచనా. సీఎం కేసీఆర్ ‘ప్రత్యామ్నాయకూటమి’ పిలుపు రాజకీయ వేడిని రగిలిస్తున్నది. కాంగ్రెసేతర,బిజెపియేతర కూటమి గురించి ఆయనమాట్లాడినా వార్త అవుతుంది. మాట్లాడకపోయినా వార్తఅవుతున్నది. ఆయన మౌనానికి కారణాలేమిటని పరిశోధించేపనిలో జర్నలిస్టులు, మేధావులు,రాజకీయ పరిశీలకులుపడిపోతున్నారు. కేసీఆర్ అందరినీ బిజీగా ఉంచుతున్నారు. కేంద్రంలో ఎదురులేకుండా సాగుతున్న బీజేపీ నాయకత్వానికికేసీఆర్ రూపంలో సవాలు ఎదురవుతున్నది. ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్దాన్,గుజరాత్,మహరాష్ట్ర,బీహర్, డిల్లీలాంటి 7 రాష్ట్రాలలో 2014లో బిజెపి ఏకపక్ష విజయాలనుసొంతం చేసుకున్నది. ఆపార్టీ సాధించిన 282 స్దానాలలో 201 స్దానాలు ఆ రాష్ట్రాలవే. కానీ ఆ తర్వాతా ప్రధాని మోడీ గ్రాఫ్తగ్గిపోతున్నదనడానికి కొన్ని ఉపఎన్నికల ఫలితాలు సాక్ష్యం. బీహర్, మద్యప్రదేశ్, రాజస్దాన్, డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లోఓడిపోయింది. గుజరాత్ లో వోటు బ్యాంకు గణనీయంగా తగ్గింది. 2019 లో దాదాపు 70-80 స్దానాలు తగ్గే అవకాశంఉన్నట్టు ఒక అంచనా.ఆ స్దానాలలో కాంగ్రేస్ గెలుపుఅవాకాశాలు ఉన్నవి. అంటే బిజెపి 282 నుంచి 200 కు తగ్గితేకాంగ్రెస్ 40 నుంచి 100 స్దానాలను దాటనుంది. బెంగాల్, కేరళ,తమిళనాడు, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లలో బిజెపికి పెద్దగా’సీన్’ లేదు. మిగిలిన రాష్ట్రాలలో కూడా బిజెపికి వచ్చేస్దానాలలో పెద్దగా మార్పు ఉండదు. పంజాబ్ లాంటి చోట్లకాంగ్రెస్ పుంజుకున్నది. స్థూలంగా జాతీయ పార్టీలు అయినబిజెపికి 200, కాంగ్రెస్ కు 150 లోపు సీట్లు వచ్చేపరిస్దితులున్నట్టు కొన్ని సర్వేలను బట్టి అర్థమవుతున్నది.కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం రెండు పార్టీలలో దేనికీరాకపోవచ్చును. బెంగాల్ లో మమత, బీహర్ లో లాలూ, తమిళ నాడులో డి.ఎం.కే, తెలంగాణలో కెసిఆర్ , ఏ.పీలో జగన్, ఒడిశా లో నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ లోమాయావతి లేదా అఖిలేష్ కు గతంలో కన్నా ఎక్కువ లోక్సభ స్ధానాలు రానున్నవి. ఈ లెక్కల ప్రకారం దాదాపుగాప్రాంతీయ పార్టీల ఖాతాలో 150 కి పైగా సీట్లు వచ్చే అవకాశంకనిపిస్తున్నది. కనుక 2019లో ప్రాంతీయ పార్టీలు కేంద్రప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించేఅవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నవి. 2019 ఎన్నికలుసమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ, తమ రాజకీయఎత్తుగడలకు పదును పెడుతున్నవి. మిత్రులేవరో, శత్రువులెవరో విభజన రేఖను గీసుకునే పనిలోపడ్డాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం డిల్లీ లోలాబీయింగ్ సందర్భంగా పలు పార్టీలు, నాయకులతో నెలకొన్నసంబంధాలను కెసిఆర్ మళ్ళీ ఉపయోగించుకోనున్నారు. తన ‘మిత్రుల’ను వెతుక్కునే పనిలో కేసిఆర్ ఉన్నారు. ఏపీలోజగన్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కేసీఆర్ శిబిరంలోఉన్నారు. ‘ఫెడరల్ ఫ్రంట్’ కు తానే నాయకత్వం వహిస్తానని కెసిఆర్ చాలా కాలం కిందటే చెప్పారు. జనాకర్షణ, డబ్బుభారత రాజకీయాలను శాసిస్తున్నవి . ఆరెండూ ఒకే చోటఉండడం అరుదు. ఆ రెండు ఉంటే ఆవ్యక్తి తిరుగులేనిరాజకీయశక్తి అవుతారని చెప్పడానికి వైఎస్ జగన్ ఒకఉదాహరణ.ఏ.పి.లో జగన్ పార్టీ అనూహ్యంగాపుంజుకుంటున్నది.కనీసం 20 లోక్ సభ స్థానాలు జగన్ గెలుచుకునే అవకాశాలున్నట్టు కేంద్ర గూడచారి వర్గాలుప్రధానికి సమాచారం చేరవేశాయి.దీంతో మోదీ ఎ.పి.నుంచి“కొత్త మిత్రుడు’గా జగన్ ను తన ఖాతాలో వేసుకున్నట్టుతెలుస్తున్నది.కానీ జగన్ కేసీఆర్ ‘సంధించిన బాణం’గా ఒకప్రచారం ఉన్నది. కాగా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటుకుఇప్పటి దాకా తమిళనాడు నుంచి కరుణానిధి, జయలలిత, యూపి నుంచి ములాయం, మాయావతి, మహారాష్ట్ర నుంచిశరద్ పవార్, పశ్చిమ బెంగాల్ నుంచి మమతాబెనర్జి, బీహార్నుంచి నితీష్ కుమార్ వంటి వారే కీలకపాత్రపోషిస్తున్నారు.వారి సరసన చేరడమే కాకుండా’రెండాకులు’ఎక్కువ చదివిన నాయకునిగానూ కేసీఆర్ గుర్తింపుపొందారు. దేశవ్యాప్తంగా బిజెపి, కాంగ్రేస్ పార్టీలుబలహీనపడుతున్న విషయాన్ని మొట్ట మొదట పసిగట్టి, జాతీయ రాజకీయాల మెడలో ఫెడరల్ ఫ్రంట్ గంట కట్టిననాయకుడు కెసిఆర్. బిజెపి, కాంగ్రెస్ వైఫల్యాలే తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ ‘విజృంభణ’కు తాత్విక ప్రాతిపదిక. కాంగ్రెస్ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మోదీ మీద ఉన్ననమ్మకంతో 2014 ఎన్నికలలో బిజెపి అద్భుత విజయాన్నినమోదు చేసుకుంది. నోట్ల రద్దు, జీ యస్టీ లాంటి ప్రయోగాలుమోది ప్రతిష్టను పాతాళానికి దిగాజార్చినవి. 2019 ఎన్నికల్లోప్రాంతీయ పార్టీల హవాకు అవకాశం ఉందని ప్రముఖ జర్నలిస్ట్రాజ్ దీప్ సర్దేశాయ్ కొద్దీ నెలల క్రితం అభిప్రాయపడ్డారు. 10 మంది ఎంపీలుంటే కేంద్రాన్ని శాసించవచ్చని కూడా ఆయనఅన్నారు. ”ఎన్టీఆర్, వైఎస్సార్ , చంద్రబాబు నుంచి కూడాకేసీఆర్ ఎంతో నేర్చుకున్నారు.ఎన్టీఆర్ లోని ఇంపల్సివ్డెసిషన్ మేకింగ్ స్టయిల్, వైఎస్సార్ లోని నిష్కర్షగావ్యవహరించే లక్షణం, చంద్రబాబులోని మానిప్యులేషన్ ఇవన్నీకలిస్తే కేసీఅర్” అని పౌరహక్కుల నాయకుడు హరగోపాల్ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యూహాత్మక వైఖరిఅసాధారణంగా ఉంటుందని పలు ఘటనలు రుజువుపరచాయి.వాక్పటిమ, ప్రతిభ, పట్టుదల, పరిశ్రమ ఆయననుతిరుగులేని రాజకీయ శక్తిగా మలచినవి. ”ఎన్టీఆర్, వైఎస్సార్ , చంద్రబాబు నుంచి కూడా కేసీఆర్ ఎంతోనేర్చుకున్నారు.ఎన్టీఆర్ లోని ఇంపల్సివ్ డెసిషన్ మేకింగ్స్టయిల్, వైఎస్సార్ లోని నిష్కర్షగా వ్యవహరించే లక్షణం, చంద్రబాబులోని మానిప్యులేషన్ ఇవన్నీ కలిస్తే కేసీఅర్” అని పౌరహక్కుల నాయకుడు హరగోపాల్ ఒక సందర్భంలోవ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యూహాత్మక వైఖరి అసాధారణంగాఉంటుందని పలు ఘటనలు రుజువు పరచాయి.వాక్పటిమ, ప్రతిభ, పట్టుదల, పరిశ్రమ ఆయనను తిరుగులేని రాజకీయశక్తిగా మలచినవి.జాతీయ రాజకీయాలపై చాలా కాలంగాఆయనకు ఆసక్తి ఉన్న విషయం కొద్ది మందికే తెలుసు.కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’ ఆలోచనఅందరూ అనుకుంటున్నట్టు కొత్తది కాదు.” తెలంగాణ మైదానంతనలాంటి వాడికి చాలా చిన్నదని, మైదానం ఇంకా మరింత విశాలంగా ఉండాల’’ని కొందరు నాయకులతో కొన్నిసంవత్సరాల క్రితమే వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆయన ‘ముందుచూపు’ అర్ధమవుతున్నది.”ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్దగా ఆలోచించాలి. అంతే భారీగా ప్రణాళికలు వేసి అమలుచేయాలి” అన్నదే కేసీఆర్ నమ్మిన సూత్రం.ఫెడరల్ స్ఫూర్తినిదెబ్బతీసేలా వ్యవహరిస్తున్న జాతీయ పార్టీలపై తిరుగుబాటుకుఆయన పక్కా ప్రణాళికతోనే సిద్దమయ్యారు. దేశవ్యాప్తంగారాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి?ఎలామారబోతున్నాయి? అన్నదానిపై కేసీఆర్ ఎప్పటికప్పుడువిశ్లేషించుకుంటూ వస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నిజట్టుకడితే జాతీయ పార్టీల పెత్తనాన్నినిలువరించవచ్చునన్నది ఆయన భావన.రాష్ట్రాలు కేంద్రానికిచెల్లిస్తున్న పన్నుల్లో 42శాతమే తిరిగి ఇచ్చి మిగతా 58శాతాన్నితమ అనుకూల రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నందున కొన్ని రాష్ట్రాలుతీవ్రంగ నష్టపోతున్నాయన్న చర్చకు కెసిఆర్ తెరలేపారు.రాష్ట్రాలకు ఆర్థిక అధికారం లేకుండా పోతే ఫెడరల్స్ఫూర్తికి అర్ధం లేదన్నది ఆయన వాదన. జాతీయ పార్టీలగుత్తాధిపత్యాన్ని నిలువరించడమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నారు. దేశవ్యాప్త రైతు సమస్యల పరిష్కారం, రాష్ట్రాలఅధికారాలను కాపాడుకోవడం వంటి ఫార్ములా మిగతాప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపై తీసుకురావడానికి ఇంధనంవలె పని చేస్తుందని కెసిఆర్ నమ్మకం. దీనిపైనే ఆయనమరింత ఫోకస్ చేస్తున్నారు. వేర్వేరు పోరాట పంథాలతోజాతీయ రణరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కెసిఆర్, చంద్రబాబు భావిస్తుండవచ్చు.కానీ వారి టార్గెట్ మోదీ. విడివిడిగా ఎవరికి వారుగా వేస్తున్న ఎత్తుగడలు దేశంలో కొత్తరాజకీయ సమీకరణలకు దారితీయనున్నవి. గత ఎన్నికల్లోఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, తెలంగాణ లో టీఆర్ఎస్, కేంద్రంలోఎన్డీయే భాగస్వామ్య బీజేపీ అధికారంలోకి వచ్చాయి. కొంతకాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలునెరిపారు. తర్వాత ఆ ‘బంధం’ తెగిపోయింది. బిజెపి కిరహస్య మిత్రుడు అనే ‘ముద్ర’ను తొలగించుకోవడానికి లోక్సభ ఎన్నికల ప్రచారసభల్లో బిజెపిపైన,మోడీ పైనా తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మోడీని చెండాడుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పేందుకువ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.దేశంలో బీజేపీసర్కారుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నవి.మరోవైపునప్రాంతీయ పార్టీల పునరేకీకరణ జరగనున్నది.ఎన్డీయేకూటమినుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగింది.గత లోక్ సభ ఎన్నికల్లో యూపీ నుంచి తన మిత్రపక్షాలతో కలిపి 73 స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. కానీ గోరఖ్ పూర్, ఫూల్పూర్లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి దిగ్భ్రాంతిని కల్గించాయి. ఎస్పీ-బీఎస్పీ ఐక్యతాప్రయోగం అక్కడ సత్ఫలితాన్నిచ్చింది. ఇదే పరంపర కొనసాగితే ఈ రెండుపార్టీలు యూపీలో 57 స్థానాల్లో గెలిచే అవకాశాలుఉంటాయన్న విశ్లేషణ ఉన్నది. బీజేపీ ఇక్కట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జాతీయస్థాయిలో రాజకీయ ఉష్ణోగ్రతలు పెరగడానికి కేసీఆర్ప్రయత్నిస్తున్నారు. జాతీయ ‘రంగస్థలాన్ని’ కుదిపేయడానికికెసిఆర్ తన చాణక్యాన్ని,చాకచక్యాన్ని,వ్యూహ చతురతనుప్రదర్శించనున్నారు. యుద్ధం తనకు అనువుగా ఉన్నప్పుడేచేయాలని నిర్ణయించుకున్న తర్వాతే అసెంబ్లీకి ముందస్తుఎన్నికలకు వెళ్లి ప్రత్యర్థులను చిత్తు చేసిన వైనాన్ని మనంచూసాం. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రసంగకళకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. మాటలతో ప్రజలను మంత్రముగ్ధులనుచేయడంలో కేసీఆర్ ది అనితరసాధ్యమైన శైలి.దక్షిణాదిలోకుమారస్వామి,స్టాలిన్, చంద్రబాబు తదితరులెవరూ హిందీ,ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు కాదు. కేసీఆర్ కుఅదొక అనుకూల అంశం. ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తేతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని అయ్యేఅవకాశముందని ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గత డిసెంబర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘లోక్ సభ ఎన్నికల తర్వాతపరిస్థితి, సందర్భాన్ని బట్టి ఎవరు ప్రధానిగా ఉండాలోనిర్ణయించుకుంటాం. ప్రధాని అయ్యేవాళ్లలో కేసీఆర్ కూడాఉండొచ్చు.ఆయనే ప్రధాని కావొచ్చు’ అని ఆమె తెలిపారు.

(ఆంద్రజ్యోతి సౌజన్యంతో)