నరేంద్ర మోడీ ప్రయోగాలను ప్రజలు ఆమోదించారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం మొదటిసారి సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘చాలా సుదీర్ఘమైన, కష్టతరమైన, సఫలమైన, విజయవంతమైన ఎన్నికల ప్రచారం తర్వాత ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుపుతున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్ని ఎన్నికల ప్రచారాలు జరిగినా, ఇది అన్నిటి కంటే సుదీర్ఘమైన ఎన్నికల ప్రచారం. ప్రజలే ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. మోడీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు జనం మా కంటే ఎక్కువ శ్రమిస్తున్నారని’ చెప్పారు. దేశప్రజలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేసిన ప్రయోగాలను ఆమోదించారని, అందువల్ల మరోసారి బీజేపీకే పట్టం కట్టబోతున్నారని షా జోస్యం చెప్పారు.

PM Modi, Amit Shah address press conference on Lok Sabha elections

India, National, Politics, BJP, Amit Shah, Narendra Modi, PM Modi, Modi Press Meet, Against BJP, New Delhi, Delhi, BJP Headquarters