ప్రణయ్ కుటుంబాన్ని కమిషన్ ఆదుకొంటుంది:ఎర్రోళ్ళ శ్రీనివాస్.

మిర్యాలగూడ:

కుల పిశాచులను కఠినాతి కఠినంగా శిక్షించి ఇటువంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్.సి,ఎస్.టి.కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఆదేశించారు.ఇది కుల దురహంకారానికి పరాకాష్టగా చైర్మన్ అభివర్ణించారు.మిర్యాలగూడ లో పరువు హత్యకు గురైన దళిత యువకుడు ప్రణయ్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ శనివారం పరామర్షించారు. డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోనే పెను సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటన తమ హృదయం ను తీవ్రంగా కలచివేసిందని, సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని పేర్కొన్నారు.

70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా ఇటువంటి పాశవిక చర్యలకు పాల్పడం అనాగరికమని, కుల పైశాచికత్వనికి పరాకాష్టని, అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న తెలంగాణలోనూ ఇటువంటి పాశవిక చర్యలను అందరూ ఖండించాలని చైర్మన్ పిలుపునిచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినాతి కఠినంగా శిక్షించి, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అయన పోలీస్ వారికీ సూచించారు.తదనంతరం షాకు కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హతుని భార్య అమృత పరామర్శించిన చైర్మన్, కమిషన్ తమకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సహా స్థానిక శాసనసభ్యులు భాస్కర రావు, కమిషన్ సభ్యులు బొయిళ్ల విద్యాసాగర్, యం రాంబల్ నాయక్, నరసింహ్మ, జిల్లా ఎస్పీ శ్రీ రంగనాథ్ లు పాల్గొన్నారు.