కాంగ్రెస్ లో ప్రియాంక శకం!! అన్నకు తోడుగా చెల్లెలు !!

కాంగ్రెస్ లో ప్రియాంక శకం!!
అన్నకు తోడుగా చెల్లెలు !!

null

ఎస్.కె.జకీర్.

కాంగ్రెస్ పార్టీలో ఇక ప్రియాంక శకం ప్రారంభం కానున్నది. ఆ పార్టీలో ప్రియాంక గాంధీ క్రియాశీల భూమిక పోషించనున్నారు. ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు చాలా కాలంగా కోరుతున్నారు. అందుకు ఆమె తిరస్కరిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ప్రియాంకను ఒప్పించడంలో ఆమె తల్లి సోనియా గాంధీ, తమ్ముడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించడం ఆ పార్టీలో కీలక పరిణామం.రాహుల్ గాంధీ వేసిన ముందడుగు, అనూహ్య ఎత్తుగడ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఇకపై పార్టీ అధ్యక్షుడు అన్న రాహుల్ కు చేదోడు, వాదోడుగా ఉండనున్నారు. 9 ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ బాధ్యతలను ప్రియాంక తీసుకోనున్నారు.ఇప్పటి వరకు తల్లి సోనియా, అన్న రాహుల్ గాంధీ నియోజకవర్గాలు రాయబరేలి, అమేధి లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధిని మాత్రమే పర్యవేక్షిస్తూ ఉన్నారు.ఎన్నికల సందర్భాలలో ఆయా నియోజకవర్గాలలో ప్రచారానికి ఆమె పరిమితమవుతూ వస్తున్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారు. ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం పట్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడం పార్టీని బలోపేతం చేస్తుందని రేణుకాచౌదరి సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు.