కేసీఆర్‌కు ఓటమి తప్పదు. రాహుల్ గాంధీ:

ఆదిలాబాద్:

”ఈ రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రికి అంబేడ్కర్ అంటే ఇష్టం ఉండదు. ఏ ప్రాజెక్టుకు కేసీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టలేదు. ఈ ప్రాజెక్టుల్లో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారు. వారి కుంటుంబం మొత్తం ఈ అవినీతిలో భాగంగా ఉన్నారు. రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు. కేసీఆర్ భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారు. భూములు కోల్పోయిన రైతులు, గిరిజనులు, ఆదివాసీలకు తగు నష్ట పరిహారం కూడా సరిగా ఇవ్వలేదు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ల నళ్లా ఇస్తామన్నారు. ఇచ్చారా? కాపలాదారుగా ఉంటానని రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి ఎందుకు కట్టబెట్టి భాగీదారుగా ఎందుకు మారారు. నాలుగున్నర సంవత్సరాలుగా అందరికీ అన్యాయం జరిగింది. ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ మోసం చేశాడు. టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడానికే కాంగ్రెస్ వస్తుంది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము. పండే పంటకు కేంద్ర ఇచ్చే మద్దతు ధరతో సహా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇచ్చి పంటను కొనుగోలు చేస్తుంది. పత్తిని 7 వేలకు కొనుగోలు చేస్తాము. మిర్చికి 10 వేలు, విద్యార్థులకు యూనిర్సల్ ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చేస్తాము. తెలంగాణ యువత నిరుద్యోగంతో పోరాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు 3 వేల నగదు అందజేస్తాము.ఆదివాసీల కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తిని గుర్తు చేసుకుందాం.దేశమంతా అంబేడ్కర్‌ను స్మరిస్తుంది కానీ.ఇక్కడి సీఎం అవమానిస్తారు. అందుకే కాళేశ్వరంటూ ప్రాజెక్టు పేరు కూడా మార్చారు.ప్రాజెక్ట్ వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచేశారు.నీరు, భూమి, అడవిపై ఆదివాసీల హక్కులు రక్షించాలని యూపీఏ చట్టం తెచ్చింది. మార్కెట్ రేటు కంటే నాలుగురెట్ల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ చెప్పింది. తెలంగాణలో ఆ భూసేకరణ చట్టాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారు. కేసీఆర్‌కు మోదీ అండగా నిలిచారు.తెలంగాణలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు .పంటలకు మద్దతు ధర రావడం లేదు .కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుస్తాం .ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం. పంటలకు మద్దతు ధర పెంచుతాం . కేసీఆర్, మోదీ చెప్పేవన్నీ అబద్దాలే ప్రతి కుటుంబానికి 15లక్షలు డిపాజిట్ చేస్తామన్న మోదీ హామీ ఏమైంది ? ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము. పంటకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రజల సమస్యలతో రాజకీయం చేస్తున్నారు. గతంలో రూ. 70వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాం. మరోసారి రైతు రుణమాఫీ చేసి తీరుతాం. నరేగా పథకాలతో కూలీలకు అండగా నిలిచాం. మోదీ వచ్చాక పేద కూలీలకు నరేగా దూరం చేశారు.దేశానికి కాపలాదారుడిని అని మోదీ చెబుతారు. చోక్సీ, లలిత్ మోదీ లాంటి స్కాంలు చేసే వారికే మోదీ కాపలాదారు వారిని మోదీ దేశం దాటించారు. రాష్ట్రాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెడతారు. ఒకరిని మరొకరిపై ఉసిగొల్పుతారు. మనందరం ఏకమై ఇలాంటివారిని ఓడించాలా వద్దా? 56 ఇంచుల చాతీ అంటూ మోదీ చెబుతారు.పార్లమెంట్‌లో నిలదీస్తే కళ్లలోకి చూడకుండా దిక్కులు చూశారు. అది ఒక్కటి చాలు.. పేదల సొమ్ము పెద్దలకు ధారపోశారని చెప్పడానికి. ఆ విషయాన్ని ఆయన చూపులే చెప్పాయి.జీఎస్టీ తీసుకొచ్చి చిన్న వ్యాపారుల జీవితాలు ఛిద్రం చేశారు.తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో మోదీ ఓడిపోతారు. ఇక్కడ, అక్కడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వాలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటాం. రూ. 3 వేల