కోదండరామ్ కు రాహుల్ ఫోన్: రేపు ఢిల్లీకి పయనం.

హైదరాబాద్:

ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటుపై అమితుమీకి రెడీ అవుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. రాహుల్ గాంధీ తనను కలవాలంటూ కోదండరామ్ కు ఫోన్ చేశారు. శుక్రవారం ఉదయం 9.30గంటలకు కోదండరామ్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో కోదండరామ్ గురువారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరనున్నారు. అనంతరం శుక్రవారం రాహుల్ గాంధీతో సీట్ల సర్దుబాటు ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కోదండరామ్ చర్చించనున్నారు. అలాగే సీట్ల సర్దుబాటుపై కూడా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.