బాలాజి హసన్ బీటెక్ మెకానిక్ పూర్తి చేసి జ్యోతిష్యంలోకి.. జనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ కుర్రాడి పేరు బాలాజి హసన్. తమిళనాడు సేలంకు చెందినవాడు. బీటెక్ మెకానిక్ పూర్తి చేసి హ్యుందాయ్ మోటర్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు.మంగళవారం ఉదయం నుండి వాట్సాప్, టీవీ, ఫేస్ బుక్ లో చంద్ర గ్రహణం గురించి, రాశి ఫలితాలు, చేయాల్సిన పూజలు, దుష్ట నివారణ చర్యల గురించి ‘సిద్ధాంతులు- జ్యోతిష్య పండితులు’ విరామం లేకుండా వివరిస్తున్నారు. అప్పుడే బాలాజి గుర్తొచ్చాడు.ఇంజినీర్ పనిచేస్తున్న బాలాజి వ్యక్తిగత ఆసక్తి మేరకు ఒక గురువు దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాడు. వృత్తిలా కాకుండా ఒక వ్యాపకంగా జ్యోతిష్యాన్ని స్టడీ చేసే ఈ యువకుడు చెప్పిన అంశాలు నిజమయ్యాయి. పాకిస్థాన్ లో ఇమ్రాన్ విజయం సాధిస్తారని చెప్పాడు. లోక్ సభ ఎన్నికల్లో మోదీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వస్తాడని చెప్పాడు. తమిళనాడులో డీఎంకే కూటమి, ఏపీలో జగన్ విజయఢంకా మోగిస్తాడని ఖచ్చితంగా చెప్పి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ జనవరిలో ‘పుదుయుగం’ అనే ఛానల్లో మాట్లాడుతూ ‘ వరల్డ్ కప్ క్రికెట్ లో ఇండియా సెమి ఫైనల్ వరకే వెళ్తుందన్నాడు. ఫైనల్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆడుతాయని చెప్పాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా నిలుస్తాడని చెప్పాడు. సాంకేతికంగా కప్ ఇంగ్లాండ్ దక్కించుకున్నా, న్యూజిలాండ్ మాత్రం ఓడిపోలేదు.