కాంగ్రెస్ తో పొత్తు టిడిపికి సమాధి!!

కాంగ్రెస్ తో పొత్తు టిడిపికి సమాధి!!

rajnath singh
కడప:

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపి భూస్థాపితమవుతుందని కేంద్ర హోమ్ శాఖమంత్రి రాజనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం కడపకు వచ్చారు. ఆయనకు బిజెపి ఏ.పీ. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్వాగతం పలికారు. కందుల ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన రాయలసీమ పార్లమెంట్ నియోజవర్గాల ‘శక్తి ప్రముఖు’ల సమావేశంలో కేంద్ర హోం మంత్రి పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు రాజ్‌నాథ్‌ నివాళులర్పించారు. పివి నర్సింహారావు, ఎన్టీఆర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో ఎన్ఠీఆర్ టీడీపీ పార్టీని ఏర్పాటు చేస్తే చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొని ఆ పార్టీని సర్వ నాశనానికి పూనుకున్నట్టు హోం మంత్రి అన్నారు.