విలేకరులపై ‘రసమయి’ తాండవం.

కరీంనగర్:

‘తలమాసినోడు’, ‘ లమీడికొడుకులు’….. విలేకరుల పట్ల రసమయి బాలకిషన్ కు ఉన్న మర్యాద ఇది.ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడే తీరు ఇదేనా?మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై ప్రజలలో అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్టు కొన్ని గ్రామాల్లో ఆయన ప్రచారం సందర్భంగా వెల్లడవుతున్నది. ఈ ఘటనలను పత్రికలలో రాసినందుకు ‘రసమయి’ విలేకరులపై చిందులు వేశారు. నిప్పులు చెరిగారు. బూతులు తిట్టారు.ప్రజల్లో తన పట్ల కోపం ఎందుకు వస్తున్నదో తనిఖీ చేసుకొని, పొరపాట్లు సరిదిద్దుకోవలసిన మాజీ ఎమ్మెల్యే విలేకరులపై రంకెలు వేయడం ఏమిటో!!! ఆదివారం అభ్యర్థులకు అవగాహన శిబిరం నిర్వహించనున్న కేసీఆర్ ఇలాంటి అభ్యర్థులకు ‘శిక్షణ’ఇస్తారా? లేక ప్రోత్సహిస్తారా? చూడాలి.