ఫోర్జరీ ఆధారాలు కోర్టుకు.. ఏ క్షణమైనా రవిప్రకాష్ అరెస్టు! కోర్టు ఉత్తర్వుల కోసం నిరీక్షణ!!

Hyderabad:

టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ను సోమ, మంగళవారాల్లో అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైంది. అతను ఫోర్జరీ చేసినట్లుగా సాంకేతిక ఆధారాలు లభించినట్టు సి.సి.ఎస్.ఏ.సి.పి.శ్రీనివాస కుమార్ ఆదివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ఈ ఆధారాలను సోమవారం కోర్టుకు సమర్పించనున్నారు.కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చట్టపరమైన చర్యలకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

మూడు రోజులుగా విచారించినా రవిప్రకాష్ సరైన సమాధానాలు చెప్పలేదని పోలీసులు అంటున్నారు.”అలంద మీడియా ఇచ్చిన కేస్ పైన అన్ని కోణాల్లో రవి ప్రకాష్ ను ప్రశ్నించాము.విచారణకు ముందు 41 crpc కింద నోటీస్ ఇచ్చే రవిని విచారించాము.

రవి ప్రకాష్ ను విచారించిన మూడు రోజులు మూడు నోటీసులు ఇచ్చాము.నటుడు శివాజీ కూడా ఈ మధ్యనే తన ఇంట్లో వాళ్లకు నోటీస్ ఇచ్చాము.మా వద్ద ఉన్న ఎవిడెన్స్, రవి ప్రకాష్ చెప్పిన సమాధానాలను రేపు కోర్ట్ కు సమర్పిస్తాము.కోర్ట్ ఇచ్చే ఇత్తర్వులను బట్టి రవిప్రకాష్ ను అరెస్ట్ చేయాలనా లేదా అన్న నిర్ణయం తీసుకుంటాం.రవి ప్రకాష్ విచారణకు వచ్చినప్పుడు బయట ఒకలా,లోపల ఒకలా వ్యవహరిస్తున్నాడు” అని సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ అన్నారు.