రెడ్డి వర్సెస్ వెలమ!!

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో జరగనున్న పోలింగ్ ఒక ఎత్తు. కొడంగల్ లో జరగనున్న పోలింగ్ మరొక ఎత్తు. కొడంగల్ ను రేవంత్ రెడ్డి తన కంచుకోటగా మార్చుకున్న సంగతి ఇంటెలిజెన్స్ అధికారులు సరిగ్గా అంచనా వేయడంలో విఫలమయ్యారనడానికి మంత్రులు హరీశ్ రావు., మహేందర్ రెడ్డి తదితరులు ఇటీవల కొడంగల్ సెగ్మెంటులో పర్యటించినపుడు అభాసు పాలు కావడమే నిదర్శనం. చట్టం తన పని మాత్రమే తాను చేసుకుపోతున్నదా! లేక ‘ ఇతరుల’ ప్రయోజనాల కోసం కూడా పని చేస్తున్నదా? అన్నది సరిగ్గా విశ్లేషిస్తే కానీ బోధపడదు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చట్ట ప్రకారం తీసుకోవలసిందే. ఈ విషయంలో ఏ వ్యక్తీ, లేదా ఏ రాజకీయ నాయకుడు మినహాయింపు కాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మినహాయింపు కాదు. రేవంత్ రెడ్డి దోషినా కాదా అన్నది న్యాయస్థానాలు నిర్ణయించక ముందు విశ్లేషకులు నిర్ణయించారు.కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఈ.డి., ఐ.టి. దాడులు చేసినవి. ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పిస్తే, అవి సమంజసమైనవని భావిస్తే, వాదోపవాదాల ప్రక్రియ పూర్తి అయినా తర్వాత కోర్టు శిక్ష విదిస్తుంది.నిజంగారేవంత్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టి ఉంటే శిక్ష విధించవలసింది కోర్టులు. క్రిమినల్ చరిత్ర ఉన్న రామారావు కానీ మీడియా కానీ, టిఆర్ఎస్ నాయకులు కానీ కాదు. ఈ చిన్న లాజిక్కును అందరు ఎలా మిస్సవుతున్నారో అంతుపట్టదు. రేవంత్ రెడ్డి పై ఐటీ, ఈడీ దాడులు జరగడంపై రాజకీయవర్గాలలోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి..?. దాడులు ‘ఎంపిక చేసుకున్న’ వ్యక్తులపైనే జరుగుతున్నందున ఈ అనుమానాలకు రెక్కలు వస్తున్నవి.

 

ఎస్.కె.జకీర్.

తెలంగాణ సమాజం పురోగమిస్తున్నదా? తిరోగమనంలో ఉన్నదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కులాతీత, మతాతీత ఉద్యమాలు జరిగినవి. సబ్బండ వర్ణాలు పాల్గొన్నవి. సకల జనులు ఆ ఉద్యమంలో తమ మహత్తరమైన పాత్రను పోషించారు. తెలంగాణ కల సాకారం తర్వాత భిన్నమైన, ఆశ్చర్యకరమైన, అసహ్యకర మైన దృశ్యాలు కనిపిస్తున్నవి. కులాలవారీగా కుంపట్లు కనిపిస్తున్నవి. కులాల వారీగా ఓటుబ్యాంకులుకనిపిస్తున్నవి.ఈ ఓటు బ్యాంకుల గొడవ ఇదివరకు లేవని కాదు. కానీ ఇప్పుడింకా స్పష్టంగా, నగ్నంగా కనిపిస్తున్నవి. కులాలవారీగా తాయిలాలు, ఆకర్షణీయ పథకాలు కొత్తేమీగాదు.కానీ గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ‘విభజన’ మరీ దారుణంగా కనిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి మధ్య రాజకీయ ఆధిపత్య పోరాటం రెండు అగ్ర కులాల మధ్య పోరాటంగా కేంద్రీకృతం కావడం దారుణం. వెలమ, రెడ్డి కులాల మధ్య అధికార పోరుగా ఇది మలుపుతిరిగింది.పైగా’మా కులం వాళ్ళ జోలికి వస్తే మేమెందుకుఊరుకుంటామ’ని ”రోడీషీటర్” గా పోలీసుల రికార్డుల్లో ఉన్న న్యాయవాది రామారావు ఒక టివి న్యూస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దబాయించడం తెలంగాణ సమాజాన్ని ఆశ్చర్యపరచింది. నిజానికి ఆ క్షణం వరకు సదరు ఫిర్యాదుదారు రామారావు కులమేమిటో ఎవరికీ తెలియదు. తనకు తానుగా’వెలమ’ అనిటివిలో కాలరు ఎగరవేసి ప్రకటించడం రాజకీయ వర్గాలలో టివిచానళ్లు చూస్తున్న వీక్షకులలో ఆసక్తి రేపింది. ” రామారావు టివి న్యూస్ ఛానళ్లలో కూర్చొని ఐ.టి. అధికారి లాగా, ఈ కేసు పరిశోధిస్తున్న వ్యక్తిలా మాట్లాడుతుండడం పట్ల మా ఇంట్లో ఐ.టి.సోదాలు జరుపుతున్న వారే ఆశ్చర్యపోయారు”. అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల వెనుక రాజకీయం ఉందా..? లేదా ? అనే ప్రశ్నకు జవాబు చెప్పేదెవరు?. కానీ గత కొన్ని నెలలుగా మరీ ముఖ్యంగా ఆయన టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి చేరిన నాటి నుంచి ఆయన కదలికలపైనా, కార్యకలాపాలపైనా అందరి దృష్టి పడింది. కాంగ్రెస్ పార్టీకి ‘కొత్త రక్తం’ ఎక్కించి జవసత్వాలు అందించిన నాయకునిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి రేవంత్ ప్రశంసలు కూడా పొందారు. అధికార టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తలపెట్టిన యుద్ధంలో రేవంత్ నిబద్ధత, పటిమ శంకించలేనివి. కనుక సహజంగానే అధికార పార్టీ రేవంత్ పై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో జరగనున్న పోలింగ్ ఒక ఎత్తు. కొడంగల్ లో జరగనున్న పోలింగ్ మరొక ఎత్తు. కొడంగల్ ను రేవంత్ రెడ్డి తన కంచుకోటగా మార్చుకున్న సంగతి ఇంటెలిజెన్స్ అధికారులు సరిగ్గా అంచనా వేయడంలో విఫలమయ్యారనడానికి మంత్రులు హరీశ్ రావు., మహేందర్ రెడ్డి తదితరులు ఇటీవల కొడంగల్ సెగ్మెంటులో పర్యటించినపుడు అభాసు పాలు కావడమే నిదర్శనం. చట్టం తన పని మాత్రమే తాను చేసుకుపోతున్నదా! లేక ‘ ఇతరుల’ ప్రయోజనాల కోసం కూడా పని చేస్తున్నదా? అన్నది సరిగ్గా విశ్లేషిస్తే కానీ బోధపడదు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చట్ట ప్రకారం తీసుకోవలసిందే. ఈ విషయంలో ఏ వ్యక్తీ, లేదా ఏ రాజకీయ నాయకుడు మినహాయింపు కాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మినహాయింపు కాదు. రేవంత్ రెడ్డి దోషినా కాదా అన్నది న్యాయస్థానాలు నిర్ణయించక ముందు విశ్లేషకులు నిర్ణయించారు.కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఈ.డి., ఐ.టి. దాడులు చేసినవి. ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పిస్తే, అవి సమంజసమైనవని భావిస్తే, వాదోపవాదాల ప్రక్రియ పూర్తి అయినా తర్వాత కోర్టు శిక్ష విదిస్తుంది.నిజంగారేవంత్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టి ఉంటే శిక్ష విధించవలసింది కోర్టులు.

క్రిమినల్ చరిత్ర ఉన్న రామారావు కానీ మీడియా కానీ, టిఆర్ఎస్ నాయకులు కానీ కాదు. ఈ చిన్న లాజిక్కును అందరు ఎలా మిస్సవుతున్నారో అంతుపట్టదు. రేవంత్ రెడ్డి పై ఐటీ, ఈడీ దాడులు జరగడంపై రాజకీయవర్గాలలోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి..?. దాడులు ‘ఎంపిక చేసుకున్న’ వ్యక్తులపైనే జరుగుతున్నందున ఈ అనుమానాలకు రెక్కలు వస్తున్నవి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోను ఇవి జరిగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం కేసులు లేవు. కానీ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసులు వెలుగులోకి వచ్చాయి.ఈ.డి.కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్లీ జైలు వైపు వెళ్లవలసిన అవసరం రాలేదు.జగన్ పై ఉన్న కేసులు ముందుకు పోవడం లేదు.అధికార పార్టీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన కూడా ఐటీ దాడులు జరగలేదా? అని ప్రశ్నించే వాళ్ళున్నారు. ఆ దాడుల్లో ఏం దొరికాయన్న విషయం ఎవరికీ తెలియదు. ఐటీ అధికారులు చెప్పలేదు.ఐ.టి.శాఖ అధికారులు నిరంతరం ఎక్కడో ఒక చోట సోదాలు జరుపుతూనే ఉంటారు. అది వాళ్ళ డ్యూటీ. అయితే రాజకీయ, సినీ రంగ ప్రముఖుల్లో లేదా హై ప్రొఫైల్ వ్యక్తులపై దాడులు జరిగినప్పుడే మీడియా ఉత్సహం ప్రదర్శిస్తుంది. రేవంత్ రెడ్డిపై ఇప్పుడే ఎందుకు దాడులు చేశారు!ఎన్నికల ముందే ఎందుకు రేవంత్ ను టార్గెట్ చేశారు! రేవంత్ కొద్దీ కాలం కిందటే అక్రమాస్తులు సంపాదించాడా..? లేక ఇప్పుడే సమాచారం వచ్చిందా..? ఆయనపై ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయంటున్నారు.

 

ఎప్పట్నుంచో కేసులు ఉంటే, ఇప్పుడే ఎందుకు సోదాలు చేశారు? ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘స్వర నమూనా’ పరీక్షలు సైతం ఆ కేసులో జరిగాయి. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆ కేసు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నవి. ‘ ఓటుకు నోటు కేసులో భగవంతుడు కూడా చంద్రబాబు ను రక్షించలేడు” అని తెలంగాణ ముఖ్యమంత్రి గంభీరంగా చెప్పినప్పుడు అందరూ నిజమే ననుకున్నారు. మరి ఇంత కాలం ఎవరు రక్షించారు..? అనే ప్రశ్న తలెత్తుతుంది. నరహంతకుడు నయీమ్ నుంచి ఎంసెట్ లీకేజీ వరకూ కేసులు ఏమయ్యాయని కొందరు ప్రశ్నిస్తున్నారు.నయీంతో అన్ని పార్టీలక నేతలకు సంబంధాలున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ నేతలకూ నయీమ్ తో సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఓ రాజకీయ నాయకుడికి కానీ, ఓ పోలీసు అధికారికి కానీ శిక్ష పడిందా..?నయీంమిధ్య, నేరాలు మిథ్య అనినమ్ముదామా? టీఆర్ఎస్, బీజేపీలో ఏ నాయకుడికి కూడా ఆదాయానికి మించిన ఆస్తులు లేవని నమ్ముదామా..? తెలంగాణలో కానీ, ఈ దేశంలో ఏ పార్టీకి చెందిన నాయకులలో ఒక్కరు కూడా ఆదాయానికి మించిన ఆస్తులు లేవా..? రేవంత్ రెడ్డికే ఉన్నాయా..? వారందరిపైనా.. ఎందుకు సోదాలు జరగడం లేదు. వారిపై ఎందుకు కేసులు రావడం లేదు.అధికార పక్షం ప్రతిపక్ష పార్టీల నాయకులనే టార్గెట్ చేస్తుందనడానికి అనేక సాక్ష్యాలు కనిపిస్తున్నవి ఎన్నికల తర్వాత డీఎంకే- బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చని వార్తలు వచ్చిన తర్వాత ‘2జీ’ కేసు మూలకు పడింది. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ దోషి అంటారు. అరవింద్ కేజ్రీవాల్ పై కేసులుంటాయి. మిగతా వారి మీద ఉండవు.ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో మీడియా పోకడలు గత నాలుగేళ్లుగా అనూహ్యంగా ఉన్నవి. కనిపించని ‘సెన్సార్ షిప్’ ఉన్నట్టు, ‘ అప్రకటిత నిషేధం’ కొనసాగుతున్నట్టు నలభై ఏళ్లకు పైగా జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళు చెబుతున్న మాట. వీరికి కేసీఆర్ పై ప్రత్యేక ద్వేషం లేదు. ప్రేమ కూడా లేదు. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల వైఖరితో కేసీఆర్ వైఖరిని పోల్చుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన అనంతరం సెప్టెంబర్ 29 న ఆయన తన ఇంటి దగ్గర నిర్వహించిన మీడియా సమావేశం కవరేజిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆ సమావేశం టివి న్యూస్ చానళ్లలో ఎంతసేపు ‘లైవ్’ చూపారో… దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చును. రేవంత్ ప్రెస్ మీట్ ముగిసిన కొద్దీ సేపటికే అధికార పార్టీ నాయకులు, మంత్రులు నిర్వహించిన విలేకరుల సమావేశాల ప్రత్యక్ష ప్రసారం ఎంత సేపు సాగిందో విశ్లేషిస్తే రాష్ట్రం లో ఏమిజరుగుతున్నదో అంచనా వేయవచ్చు. కొన్ని మీడియా సంస్థలు ‘ఫేవర్ మీడియా’లుగా రూపాంతరం చెందినవనే విమర్శలకు గురవుతున్నవి. కొన్ని పత్రికలు, టివి న్యూస్ చానళ్లను అధికార పార్టీ నాయకుల ‘అనుచరులు’ నేరుగా కొనుగోలు చేయడమో, పెట్టుబడులు పెట్టడమో జరిగిపోయిందన్న ప్రచారం ఉన్నది. మిగతా మీడియా సంస్థలు కూడా టిఆర్ఎస్ కు ‘పరోక్ష ఆధీనంలోకి’ వెళ్ళిపోయినట్టు జర్నలిస్టు సంఘాల నాయకులు చెబుతున్నారు. అందువల్ల నిష్పాక్షిక వార్తల కోసం వెదకడం వృధా. ప్రత్యర్థులను రా జకీయంగా, ఆర్ధికంగాబలహీనపరచాలనుకుంటున్న అధికార పక్షానికి వెన్నుదన్నుగా నిలవడం తమ బాధ్యతగా కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి ఇంటిపై ‘ఐటీ దాడుల’ నేపథ్యంలో మీడియా వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతున్నది. ”రేవంత్ రెడ్డి అక్రమాస్తులు కలిగి ఉన్నారని రామారావు అనే అడ్వకేట్ ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి పై ఐటీ అధికారులు రైడ్ చేయగానే యథావిథిగా మీడియా ఎప్పటిలాగానే కథనాలు మొదలు పెట్టింది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండటం, ఇటీవలే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కడం తో ఈ రైడ్స్ రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయని అంతా భావించారు. మీడియా కూడా మొదట్లో ఇదే లైన్ లో ప్రసారాలు మొదలు పెట్టింది. వాస్తవానికి ఐటీ రైడ్స్ జరిగే సమయంలో లోపల ఏం జరుగుతోందన్న సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కదు. రైడ్స్పూర్తైన తర్వాత అధికారులు మీడియాతో మాట్లాడటమో లేక ఐటీ రైడ్స్ జరిగిన వ్యక్తి మీడియా ముందుకు వచ్చి విషయాలు వెల్లడిస్తేనో అసలు ఏం జరిగిందన్న క్లారిటీ రాదు.

అటు అధికారులు, ఇటు సదరు వ్యక్తి ఇద్దరు అధికారికంగా మాట్లాడకపోయినా… ఆఫ్ ది రికార్డు సమాచారం కూడా సేకరించే అవకాశం ఉంటుంది. కానీ, రేవంత్ వ్యవహారంలో అధికారులు రైడ్ చేసిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయనకు కబురు పెట్టిన ఐటీ అధికారులు ఆయన వచ్చే వరకు ఆయన ఇంట్లోనే వేచి ఉన్నట్టు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాతే సెర్చ్ మొదలైంది. అప్పటి వరకు జరిగిందేమీ లేదు. అయినా, ఏదో జరిగిపోతున్నట్టు మీడియా ప్రచారం చేసింది. రేవంత్రాకముందే నాలుగు గంటల ప్రాంతంలో సడెన్ గా మీడియా ప్లేటు ఫిరాయించింది. రామారావు ఇచ్చిన ఫిర్యాదు కాపీలో ఉన్న అంశాలన్నీ రుజువైపోయినట్టు, రేవంత్ వద్ద రూ. 1000 కోట్ల అక్రమాస్తులు మూలుగుతున్నట్టు ప్రసారాలు మొదలు పెట్టారు. ఈ ప్రసారాలకు మూలం ఎక్కడున్నదో సులభంగా అర్ధం చేసుకోవచ్చు”. అని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు. ఒక టివిచర్చాకార్యక్రమంలోఫిర్యాదుదారు రామారావు తన కుల ఆవేదనను బహిరంగం చేశారు. రేవంత్ రెడ్డి ఓ కులాన్ని (వెలమలను) టార్గెట్ చేస్తున్నారని, ఆ కులంలో ఉన్న తనలాంటి వారు ఎవరైనా ఇలాంటివి సహించరని తన కాసినివెళ్లగక్కాడు. రామారావు ఎవరి కోసం ఈ కథ అంతా నడుపుతున్నారో ప్రజలకు అర్ధమైపోయింది. రేవంత్ రెడ్డి వెయ్యి కోట్లు అక్రమార్జన చేసినట్టు ఒక ప్రముఖ దినపత్రిక హెడ్డింగ్ పెట్టేసింది. ‘ప్రభువు’ను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మీడియా సంస్థలు పోటీ పడ్డాయని ఆరోపణలు ఇంకా వస్తూనే ఉన్నవి. .