”నాపై రౌడీషీటర్ ను ఉసిగొల్పిన కేటీఆర్. నీ ఫిలింనగర్ లీలలు బయటపెడతా” – రేవంత్ రెడ్డి.

రామారావ్ లైవ్ లు చూసిIT అధికారులు కూడా ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టురేవంత్ తెలిపారు. తెలంగాణ మారుమూల గ్రామంలో తిరిగి కెసిఆర్ దోపిడీ,కెసిఆర్ కమిషన్,కెసిఆర్ వేల కోట్ల అవినీతి,కమిషన్ కాకతీయ గురించి ప్రజలకు వివరిస్తానన్నారు. ఉద్యమం ముసుగులో కెసిఆర్ సంపాదించిన ఆస్తులు గురించి బయటపెడతానన్నారు. కేటీఆర్ఫిలింనగర్ లో సినిమా వాళ్ళతో చేస్తున్న చీకటి వ్యాపారం గురించి బయట పెడతానన్నారు. కేసిఆర్ తనను ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ చేస్తానన్నాడని రేవంత్ ఆరోపించారు. 32 ఎకరాల భూమిని మైహోమ్ రామేశ్వరరావు రావుకి భూ అక్రమ కేటాయింపులు చేసాడని ఆరోపించారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయట పెట్టే సత్తా ఉందని తనను కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియంచారని చెప్పారు. తనకు కాంగ్రెస్ లో పదవి రాకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక దుర్మర్గపు చర్యలు చేపట్టాడని తెలిపారు. అందుకే ఏసీబీ కేసులు, ఐటీ ఈడీ రైడ్స్అని అన్నారు. మోదీ, కేసిఆర్ మధ్య జరిగిన ఒప్పందమే ముందస్తు ఎన్నికలు, తనపై ఐటీ,ఈడీ, సీబీఐ కేసుల కుట్రలని ఆయన చెప్పారు. తెలంగాణలో తనపై ఉన్న విశ్వసనీయతపై బురద జల్లే ప్రయత్నమే ఈ కక్ష సాధింపు చర్యలని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐటీ అధికారుల మీద కూడా ఒత్తిడి జరిగిందన్నారు. తనను విచారిస్తున్న అధికారులకు అనేక ఫోన్లు, మెసేజ్ లు వచ్చాయని, ఆ ఒత్తిడి ఎవరిదని ప్రశ్నించారు.

హైదరాబాద్; 
2001 లో టిఆర్ఎస్ ప్రారంభించిన ప్పటి నుండి కేసీఆర్ సంపాదించిన ఆస్తులు, తాను సంపాదించిన ఆస్తులపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. విచారణకు సిద్ధం కాకపోతే , 24 గంటలో కెసిఆర్ దీనిపై స్పందించకుంటే కెసిఆర్ ఓడిపొయినట్టేనాని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు తన కళ్ళల్లోకి చూసి దైర్యంగా మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేరిన కొన్ని నెలలోనే తనను గౌరవించి కార్య నిర్వహణ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని తెలిపారు .మొదట ఏసీబీ తో తనపై పై దాడి చేయించారాణి, ఆతరువాత తాను పెటిన కేసులకు పరువు నష్టం వేశారని చెప్పారు. మోడీ శత్రువు చంద్రబాబు అని అన్నారు. కేడీ కెసిఆర్ శత్రువు రేవంత్అని అన్నారు. ఇద్దరినీ ఇరికించడమే మోడీ కెడిప్లాన్గారేవంత్ ఆరోపించారు. కుట్రలో పాత్రదరుడు కెసిఆర్ పాత్రధారి అయితే మోడీ సూత్రధారి అనిరేవంత్ ఆరోపించారు. .తెరాస,బీజేపీస్కాం లు బయటపెడితే రెండు చిత్తుగా మారుతాయన్నారు. రౌడీ షీటర్ రామారావు కెసిఆర్ వదిలిన బాణం అని ఆయన ఆరోపించారు. దానికి ఇంధనం ‘మై హోమ్ ‘రామేశ్వరరావు అని అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ డి ఐ జి ప్రభాకర్ రావు పాత్రధారులన్నారు. రెడ్డిలు vs వెలమల గొడవ అని రామారావు లైవ్ లో ఒప్పుకున్నాడని రేవంత్ గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి కుల గొడవలు పెట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు. రామారావు ఏమైనా income tax అధికారా ? అనిరేవంత్ ప్రశ్నించారు. .రామారావ్ లైవ్ లు చూసి IT అధికారులు కూడా ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు. తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టురేవంత్ తెలిపారు. తెలంగాణ మారుమూల గ్రామంలో తిరిగి కెసిఆర్ దోపిడీ,కెసిఆర్ కమిషన్,కెసిఆర్ వేల కోట్ల అవినీతి,కమిషన్ కాకతీయ గురించి ప్రజలకు వివరిస్తానన్నారు. ఉద్యమం ముసుగులో కెసిఆర్ సంపాదించిన ఆస్తులు గురించి బయటపెడతానన్నారు. కేటీఆర్ఫిలింనగర్ లో సినిమా వాళ్ళతో చేస్తున్న చీకటి వ్యాపారం గురించి బయట పెడతానన్నారు. కేసిఆర్ తనను ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ చేస్తానన్నాడని రేవంత్ ఆరోపించారు. 32 ఎకరాల భూమిని మైహోమ్ రామేశ్వరరావు రావుకి భూ అక్రమ కేటాయింపులు చేసాడని ఆరోపించారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయట పెట్టే సత్తా ఉందని తనను కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా నియంచారని చెప్పారు. తనకు కాంగ్రెస్ లో పదవి రాకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక దుర్మర్గపు చర్యలు చేపట్టాడని తెలిపారు. అందుకే ఏసీబీ కేసులు, ఐటీ ఈడీ రైడ్స్అని అన్నారు. మోదీ, కేసిఆర్ మధ్య జరిగిన ఒప్పందమే ముందస్తు ఎన్నికలు, తనపై ఐటీ,ఈడీ, సీబీఐ కేసుల కుట్రలని ఆయన చెప్పారు. తెలంగాణలో తనపై ఉన్న విశ్వసనీయతపై బురద జల్లే ప్రయత్నమే ఈ కక్ష సాధింపు చర్యలని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐటీ అధికారుల మీద కూడా ఒత్తిడి జరిగిందన్నారు. తనను విచారిస్తున్న అధికారులకు అనేక ఫోన్లు, మెసేజ్ లు వచ్చాయని, ఆ ఒత్తిడి ఎవరిదని ప్రశ్నించారు. . తనను ఏ జైల్లో పెట్టినా కేసీఆర్ కుటుంబంపై పోరాడుతానన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ దోపిడిపై ప్రజలకు వివరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. తన తండ్రి కేసీఆర్ ను కునుకు లేకుండా చేస్తున్నందున తనపై రామారావు అనే కుక్కను కేటీఆర్ ఉసిగొల్పినట్టు తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ ఆరోపించారు. మీడియాలో పత్రికల్లో తనపై అనేక తప్పుడు కధనాలు రాసారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కుట్రలు తిప్పికొట్టడానికి తనకు అండగా ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. .కాంగ్రెస్ పెద్దలు అందరూ నాకు అండగా నిలిచారన్నారు .జగ్గారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తో పాటు తనపై జరిగిన ఐటీ దాడి కేసీఆర్ చేసిన రాజకీయ దాడి అని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. 2009 లో తనకు ఆస్తులు, బినామీ కంపెనీలు ఉన్నాయని ఆరోపించారని తెలిపారు . హాంకాంగ్, మలేషీయాల్లో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని బినామీ ఆస్తులున్నాయని ఆరోపించినట్టు చెప్పారు.. జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం 30 ఏళ్ళకు ముందే కొనుగోలు చేసామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నామని వివరించారు. తనకు ఉన్న ఆస్తులు 2009 ఎన్నికల ఆఫిడవిట్లోపేర్కొన్నవే2014 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నానని ఆయన వివరించారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారమే అఫిడవిట్లో ప్రస్తావించానని చెప్పారు. తమ ఇంటిని గత ఇరవై ఏళ్లుగా అద్దెకు ఇచ్చామని తెలిపారు. ఆ ఇంటి అడ్రెస్ పై అనేక కంపనీలు ఉన్నట్టు తనకు తెలియదన్నారు.తన మామ వాళ్ళు కోటీశ్వరులని, సిటీలో కొన్ని వందల ఎకరాల ఉన్నాయన్నారు. వాళ్ళను అందరినీ నా బినామీలు అంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1992 మే 7న తన వివాహం అయ్యిందని, అప్పటి ఆస్తులు కానీ ఆ తరువాతి ఆస్తులు తన స్వార్జితంగా ఆయన తెలియజేశారు. ఓ రౌడీ షీటర్ కు కేటీఆర్ తనపై పై ఫిర్యాదు చేయమని చెప్పాడని రేవంత్ ఆరోపించారు. .తనకు హంకాగ్, మలేషియాలో నాకు ఖాతాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. తన పెళ్లి కాక ముందే నా పిల్లను ఇచ్చిన మామకు కోట్ల ఆస్థులున్నట్టు చెప్పారు. తాను ఉంటున్న ప్లాట్లు వాళ్ళవేనాని తెలిపారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత తన ఆస్తులు ఎన్నో తెలుసుకొని ఆరోపణలు చేయాలని కోరారు. ఎవడో ఒక రౌడి షీటర్ అతనిపై పీడీ యాక్ట్ ను ఎత్తివేయించడానికి గాను ఈ కుటిల పన్నాగం పన్నినట్టురేవంత్ ఆరోపించారు. విదేశాల్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే అక్కడ అర్హతలు ఉండాలని, తనకు ఎలాంటి అర్హతలు లేవన్నారు. తన పై వచ్చిన ఆరోపణలపై బహిరంగ విచారణ చేయాలని విచారణ సంస్థల్ని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. ప్రగతిభవన్ లో కేసీఆర్ బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నట్టు రేవంత్ అన్నారు. పత్రికా విలువలు రోజురోజు పూర్తిగా దిగజారి పోతున్నాయని ఆయన ఆవేదన చెందారు. మీడియా సంస్థలు నైతిక విలువలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. . ఓ ఛానెల్ డిస్కషన్ లో తనపై తీవ్రమైన ఆరోపణలు చేసారని ఆయన చెప్పారు. .