మోడీపై ‘పరివారం’ అసంతృప్తి!!

మోడీపై ‘పరివారం’ అసంతృప్తి!!

RSS Joshi

నాగ్ పూర్:

కేంద్రప్రభుత్వ పనితీరుపై సంఘ్ పరివార్ శక్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేస్తున్నవి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడానికి కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మండిపడ్డారు. ‘ప్రహర్ సమాజ్ జాగృతి’ రజతోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. పొరుగు దేశాలతో యుద్ధం చేయకపోయినా సరిహద్దుల్లో మన జవాన్లు చనిపోతున్నారని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించనందుకే ఈ ఘటనలు జరుగుతున్నట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. అయోధ్యలో ‘రామ మందిర’ నిర్మాణం జరుగుతుందని 2025 కల్లా అందుబాటులోకి రానుందని కూడా ఆర్ఎస్ ఎస్ నాయకుడు
భయ్యాజీ జోషి అన్నారు.