“సంసద్ రత్న” రాపోలు ఆనంద భాస్కర్!

“సంసద్ రత్న” రాపోలు ఆనంద భాస్కర్!
samsad ratna

చెన్నై:

రాజ్యసభ పూర్వ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ను ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ప్రతిష్టాత్మక సంసద్ రత్న పురస్కారం తో సన్మానించింది. శనివారం నాడు చెన్నయ్ లోని రాజ్ భవన్ దర్బార్ హాల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పదహారవ లోకసభ కాలంలో పార్లమెంట్ ఉభయసభల్లో కనబరచిన కార్యాచరణ ను గీటురాయి గా తీసికొని ఎంపిక చేసిన 12 పార్లమెంటేరియన్ లలో ఆనంద భాస్కర్ ఒకరు. ఈ సందర్భంగా విలేకరులతో ఫోన్లో సంభాషించిన ఆనంద భాస్కర్ ఈ పురస్కారం పార్లమెంట్ లో చేసిన తన కృషికి సంతృప్తిని ఇచ్చిందని, ఇప్పుడు పార్లమెంట్ బయట కూడా బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.