ఫైజ్ భాయ్ మృతి తీరని లోటు సంస్మరణ సభలో సంతాపం.

ఫైజ్ భాయ్ మృతి తీరని లోటు
సంస్మరణ సభలో సంతాపం.
null

హైదరాబాద్;

సీనియర్ ఉర్దూ పాత్రికేయులు, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నాయకుడు ఫైజ్ మహ్మద్ అస్ఘర్ సంస్మరణ సభను శనివారం టీయుడబ్ల్యుజె, హెచ్ యు జె, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫోరం ల సంయుక్త ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఎప్పుడూ జనహితాన్ని కాంక్షించే ఫైజ్ భాయ్ ఆకస్మిక మృతి ఒక్క మీడియా రంగానికే కాకుండా యావత్తు సమాజానికే తీరని లోటని పలువురు వక్తలు స్పష్టం చేశారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఛైర్మెన్ రహీముద్దీన్ అన్సారీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు మాజీద్, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అహ్మద్, సీనియర్ ఉర్దూ సంపాదకులు ఆయూబ్ అలీ ఖాన్, ఐజేయు కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ,టీయుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైసల్ అహ్మద్, హెచ్.యు.జె అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శంకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు వి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.