కరెంట్ షాక్ తో 7 ఏనుగులు మృతి!!

భువనేశ్వర్:
ఒడిషాలోని డెంకనాల్‌ జిల్లా సదర్‌ ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌ తో ఏడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. శుక్రవారం రాత్రి 13 ఏనుగులు అడవుల నుంచి కమలాంగో గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం నుంచి వెళ్తున్న సమయంలో కరెంట్‌ తీగలు అడ్డుపడ్డాయి. చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన హైవోల్టేజ్ వైర్లు తగలడంతో ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఓ సాగుభూమి వద్ద ఉన్న నీటి కాలువ వద్ద వీటి మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలను ఉంచడం వల్లనే ఏనుగుల ప్రాణాలు పోయాయని స్థానికులు అంటున్నారు. మిగతా ఆరు ఏనుగులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అటవీశాఖాధికారులు తరలివచ్చి ఏనుగుల కళేబరాలను పోస్టుమార్టం చేయించారు. మరణించిన ఏనుగులను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.