తరచూ సెక్స్ తో బోలెడు లాభాలు!!

తరచూ సెక్స్ తో
బోలెడు లాభాలు!!

hyderabad:

తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నవి. ఈ మేరకు పలు పరిశోధనలు కూడా గతంలో రుజువు పరచినవి. చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ‘అలీబాబా డాట్ కామ్’ అధినేత జాక్ మా కూడా తన ఉద్యోగులకు అదే విషయాన్ని తాజాగా చెప్పారు. ఇటీవల ఆ సంస్థ నిర్వహించిన ఉద్యోగుల సామూహిక వివాహ వేడుకకు హాజరైన జాక్మా ”మెరుగైన జీవనానికి అందరూ వారానికి ఆరు రోజులపాటు రోజుకు ఒక్కసారి శృంగారంలో పాల్గొనాల”ని ఉద్బోధించారు. ఆయన ‘669’ ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములా ప్రకారం మొదటి రెండు అంకెలూ ఆరు రోజులకు, ఆరుసార్లకు ప్రతీకలు. మూడో అంకె తొమ్మిది. చైనాలో ‘9’ అంకెను చూపే సంకేతానికి ‘ఎక్కువసేపు’ అనే అర్థం వస్తుంది. అంటే శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ ఎక్కువసేపు పాల్గొనాలని దాని అర్థం.ఇక పని విషయంలో ఉద్యోగులు ‘996’ ఫార్ములా పాటించాలని ఆయన చెప్పారు. ఇందుకు ‘996’ ఫార్ములా జోడించారు. అంటే రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది దాకా, వారానికి ఆరు రోజులపాటు పనిచేయడం.