ప్రమాదంలో 60 గొర్రెల మృతి.

ప్రమాదంలో 60 గొర్రెల మృతి.

null

నిజామాబాద్:

డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 60 గొర్రెలు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం (బి) గ్రామశివారులోని నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద సబ్సిడి గొర్రెలను కొనుగోలు చేసుకొని వ్యాన్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా గురువారం ఉదయం 6గంటలకు అతివేగంగా వస్తున్న ఆర్టిసి బస్సు ఎపి25జడ్0073 నంబర్ గల బస్సు ఢీకొనడంతో సుమారు 60 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు