మమతా బెనర్జీ ర్యాలీతో మోడీ గుండెల్లో రైళ్లు!!

మమతా బెనర్జీ ర్యాలీతో
మోడీ గుండెల్లో రైళ్లు!!

uddhav thakrey

ముంబాయి:

కోల్ కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. మమత ర్యాలీపై ప్రధాని వ్యాఖ్యలను ఉద్ధవ్ తీవ్రంగా విమర్శించారు. మమతా బెనర్జీ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహాన్ని చూసి మోడీ గాభరా పడుతున్నారని శివసేన ఎద్దేవా చేసింది. ప్రతిపక్షాలను ప్రజా వ్యతిరేకులుగా చిత్రీకరించడాన్ని ప్రధాని మానుకోవాలని సూచించింది. 22 విపక్షాలు ఒక్కతాటిపైకి రావడం చూసి ఆయన శతఘ్ని ఎందుకు వణుకుతోందని ప్రశ్నించింది. తాము ఎన్నటికీ అధికారంలో ఉండబోమని బీజేపీ గుర్తించాలని చెప్పింది. వచ్చే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని గుర్తు చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం రాజధాని కోల్ కతాలో నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీకి 22కి పైగా రాజకీయ పార్టీలకు చెందిన 25 మంది నేతలు పాల్గొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కోవాలని తీర్మానించారు.