‘స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం’ – సీఎం.

‘స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం’ – సీఎం.
Speaker election

హైదరాబాద్:

అసెంబ్లీ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ తో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ప్రతిపాదించారు. సీఎం ప్రతిపాదనకు ఎంఐఎం, బిజెపి అధ్యక్షులు వెంటనే అంగీకారం తెలిపారు. పార్టీలో చర్చించి గురువారం ఉదయం తమ నిర్ణయం ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు బదులిచ్చారు.