నవ వధువు ఆత్మహత్య!!

నవ వధువు ఆత్మహత్య!!

భువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు లో నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. మానస అనే యువతికి నెల రోజుల కిందటే హైదరాబాద్ శేరిలింగంపల్లి కి చెందిన విక్రమ్ తో వివాహం జరిగింది.ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తల్లి ఊరైన కొల్లూరు లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలు , సమస్యలే మృతికి కారణం అంటున్నారు బంధువులు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.