సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిసా..మజాకా?..వైరల్ వీడియో

న్యూఢిల్లీ:

ఇటీవల సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రంజన్ గోగొయ్ ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారని పేరు పడ్డారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఒకేసారి నలుగురు జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ జర్నలిస్టులతో మాట్లాడనున్నట్టు ప్రకటించారు. అంతే.. 8 ఏళ్లకు పైగా శుభ్రతకు నోచుకోని సుప్రీంకోర్టు ప్రెస్ లాంజ్ లో కదలిక వచ్చింది. ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన సిబ్బంది యుద్ధ ప్రాతిపదికపై ఆ పరిసరాల రూపురేఖలు మార్చేశారు. చెత్త ఏరేసి, గోడలు, అద్దాలను శుభ్రపరిచి రోజూ అక్కడ తిరిగే జర్నలిస్టులే ఆశ్చర్యపోయేలా చేశారు.