ఉద్యోగినికి వేధింపులు. డీన్ అరెస్ట్.

ఉద్యోగినికి వేధింపులు. డీన్ అరెస్ట్.

హైదరాబాద్:

తార్నాక నారాయణ కళాశాలలో డీన్ శ్రీనివాస్ కిందిస్థాయి ఉద్యోగిని ని వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగిని బంధువులు కళాశాలలో ఆందోళనకు దిగారు. డీన్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు డీన్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని ఓయూ పీఎస్ కుతరలించారు. అస్రా ఫాతిమా మహిళా అనే ఉద్యోగిని గత 10 సంవత్సరాలు గా తార్నాక నారాయణ కళాశాలలో పనిచేస్తుంది. గత కొద్దీ రోజులుగా డీన్ శ్రీనివాస్ ఫోన్ చేసి తనని వేధిస్తున్నాడని కళాశాల ముందు తన బంధువులతో ఆందోళనకు దిగింది. డీన్ శ్రీనివాస్ ను నారాయణ యాజమాన్యం వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.