రేపే టాటా హ్యారియర్ విడుదల.

రేపే టాటా హ్యారియర్ విడుదల.
TATA Harriar

న్యూఢిల్లీ;

చాలా కాలంగా భారత ఆటోమొబైల్ మార్కెట్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఎస్ యువిలలో టాటా హ్యారియర్ ఒకటి. ఇన్నాళ్లూ ఎలా ఉండబోతుందోనని ఊరించిన టాటా హ్యారియర్ రేపు (జనవరి 23) మార్కెట్లోకి విడుదలవుతోంది. ఇప్పటికే వెలుగు చూసిన టీజర్లు, రహస్య ఫుటేజీలు, లీకైన వివరాల కారణంగా ఈ టాటా మోటార్స్ నుంచి వస్తున్న ఈ ఎస్ యువి గురించి చాలానే తెలిసిపోయింది.
టాటా హ్యారియర్ లో ఇక ప్రధాన ఫీచర్ల గురించి చెప్పాలంటే పవర్ ట్రెయిన్ ని ముందుగా పేర్కొనాలి. హ్యారియర్ 5 సీటర్ వాహనంగా ఉండబోతోంది. ఇది డీజిల్ ఇంజన్ తో కూడిన 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో ప్రవేశపెట్టనున్నారు. దీని సరికొత్త 4 సిలిండర్ క్రయోటెక్ 2 లీటర్ టర్బోఛార్జ్ డ్ మోటార్ ని జీప్ కంపాస్ లోని మల్టీజెట్ II నుంచి తీసుకున్నారు. హ్యారియర్ లోని పవర్ ప్లాంట్ కు 140పీఎస్ పవర్, 350ఎన్ఎం టార్క్ ని విడుదల చేసే సామర్థ్యం ఉంది. హ్యారియర్ టాటా ఇంపాక్ట్ డిజైన్ 2.0 కేంద్రీకృతంగా తయారైంది. గత ఏడాది ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన హెచ్5ఎక్స్ కాన్సెప్ట్ కార్ లోని పలు డిజైన్ ఫీచర్లను ఈ ఎస్యువీలో పొందుపరిచారు. సన్నని చీలిక వంటి హెడ్ ల్యాంప్, గ్రిల్ ను ఈ కార్ లో అమర్చారు. ప్రధాన హెడ్ ల్యాప్ యూనిట్ ను ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ కింద ఏర్పాటు చేశారు. పెద్ద చక్రాలు, దూకుడుగా మలుపు తిరిగిన సైడ్ ప్రొఫైల్, ఒక వాలుగా ఉన్న పైకప్పులు ప్రధానంగా కనిపిస్తాయి. ఎస్యూవీ డిజైన్ కోసం రెండు వైపులా హ్యారియర్ కు ఫాక్స్ స్కఫ్ ప్లేట్ అమర్చారు. ఇక ఇంటీరియర్స్ విషయానికొస్తే హ్యారియర్ ను ప్రీమియమ్ ఎస్యూవీగా ప్రవేశపెడుతున్నందువల్ల టాటా అన్ని ఉన్నతశ్రేణి సదుపాయాలు ఉండవచ్చు. ట్విన్ స్క్రీన్ సెటప్, 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 9 స్పీకర్ జెబిఎల్ ఆడియో యూనిట్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ ఉంటాయని భావిస్తున్నారు. భద్రత కోసం ఏబీఎస్, క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రామ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండనున్నాయి.రేపు లాంచ్ సమయంలోనే ధరలను ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పలు ఎస్యూవీల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సుమారుగా రూ.16-21 లక్షల వరకు ఉండవచ్చని అంటున్నారు. హ్యారియర్ ప్రధానంగా జీప్ కంపాస్, హ్యుండై క్రెటా, హ్యుండై టక్సన్, మహీంద్ర ఎక్స్ యువి500లను ఢీ కొట్టనుంది. ఈ ఏడాదిలోనే 7 సీటర్ హ్యారియర్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు టాటా తెలిపింది. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో పెట్రోల్ వేరియంట్ ను కూడా తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.