అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నిక ఏకగ్రీవం.

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఎన్నిక ఏకగ్రీవం.

Telangana assembly speaker
హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇవాళ రెండోరోజు అసెంబ్లీ మొదలైన వెంటనే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రకటన చేశారు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్. గురువారం సాయంత్రం ఐదు గంటలవరకు స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లు తీసుకున్నామని… అన్ని పార్టీల నాయకులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును ప్రతిపాదించారని ప్రొటెం స్పీకర్ చెప్పారు. కె.చంద్రశేఖర్ రావు, అజ్మీరారేఖ, మల్లు భట్టి విక్రమార్క, తలసాని శ్రీనివాస్ యాదవ్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా .. స్పీకర్ గా పోచారం ను ప్రతిపాదించారని చెప్పారు. మరో పోటీ దారు లేకపోవడంతో… తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత స్పీకర్ కుర్చీలో పోచారం ను కూర్చోబెట్టారు ముంతాజ్ అహ్మద్ ఖాన్. పోచారంను సీఎం కేసీఆర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ , మరికొందరు నాయకులు అభినందించారు.