సిఎం నమ్మకాన్ని నిలబెడతా!! – పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి:

సిఎం నమ్మకాన్ని నిలబెడతా!!
– పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి:

telangana civil supplies chairman mareddy

హైదరాబాద్:

కెసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా తెలంగాణ పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతానని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.శుక్రవారం పౌరసరఫరాల భవన్‌లో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాస శాఖ కమిషనర్‌, అకున్‌ సబర్వాల్‌, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎంఎల్‌ఎలు, టి. హరీష్‌రావు, ఈటెల్‌ రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జదగీశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్‌, ఎంఎల్‌సీలు నాయినీ నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ జి. బాలమల్లు, జీఎచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పలువురు కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.