ఇటు అతివేగం, అటు ‘నత్త’ తో పోటీ.

బస్సుయాత్రలు రెండు మూడు ‘ట్రిప్పుల’ వల్ల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కొంత ఉత్సాహం వచ్చిన మాట నిజమే. ఆ ఊపును సజీవంగా ఉంచడంలో విఫలం కావడం ఉత్తమ్ స్వయంకృతాపరాధమని కొందరు కాంగ్రెస్ ప్రముఖులే అంటున్నారు. టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి వంటి ‘షార్ప్ షూటర్’ కు పార్టీలో ప్రాధాన్యం లేదు. తగిన పదవి ఇంకా ఇవ్వలేదు. ఆయనను చాలామంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తమ నియోజకవర్గాలకు రావాలని, ప్రచారం చేయాలని వినతులు వస్తున్నవి. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వివిధ నియోజకవర్గాల నుంచి. జిల్లాల నుంచి వచ్చిన ఆశావహులు, పార్టీ నాయకుల సందడి నెలకొంటున్నది. వందలాది మంది కార్యకర్తలు రేవంత్ మద్దతు కోరుతున్నారు. ఆయన సహకారాన్ని ఆశిస్తున్నారు. టికెట్ల విషయంలో తమ గురించి ఒక మాట చెప్పాలని కోరుతున్నారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం ను కలవవలసిందిగాఅఆశావహులకురేవంత్నచ్చజెపుతున్నారు. తాను కాంగ్రెస్ లో కొత్తగా చేరిన వ్యక్తినని పార్టీ అధిష్టానం, టిపిసిసి మాత్రమే అభ్యర్థుల వడపోత, ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారని రేవంత్ సున్నితంగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఇల్లు ఆశావహులతో, పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న సంగతి కాంగ్రెస్ దిగ్గజాలకు మింగుడుపడనిది. అయితే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్’ప్రధాన ప్రచారకర్త’ . స్టార్ క్యాంపెయినర్. ప్రజలు రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా ఆమోదిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను అన్ని ప్రాంతాలకు ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన సమర్ధతను తగిన విధంగా వాడుకోకపోతే కాంగ్రెస్ కె నష్టం. రేవంత్ రెడ్డికి జరిగే నష్టమేమీ లేదు. తన సిట్టింగ్ సెగ్మెంటు కొడంగల్ ను తాను నిలబెట్టుకోగలనన్న ధీమా ఆయనకు ఉన్నది.

ఎస్.కె.జకీర్.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నత్త తో పోటీ పడుతున్నది.అటు వాయు వేగంతో టిఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఇప్పటికే రెండు సభలను అధికార పార్టీ నిర్వహించింది. మరికొన్ని బహిరంగ సభలు, రోడ్ షో లకు ప్రణాళికలు రచించింది. టిఆర్ఎస్ ఎన్నికలప్రణాళిక కమిటీ తొలి సమావేశం కూడా జరిగింది. కాంగ్రెస్ ఇంకా మీన మేషాలు లెక్కపెడుతున్నది. మేనిఫెస్టో,క్యాంపైన్ కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉన్నది. ప్రచార కార్యక్రమాల రోడ్ మ్యాప్ ఖరారు కావలసి ఉన్నది. ఇప్పటికైతే ఎన్నికలలో పోటీకి అభ్యర్థుల వడపోతకు గాను ఢిల్లీ స్థాయిలో ‘స్క్రీనింగ్’ కమిటీ మాత్రమే ఏర్పడింది. ఈ కమిటీ తెలంగాణలో పర్యటించవలసి ఉన్నది. ఓ వైపు టిఆర్ఎస్ వ్యతిరేక ‘కూటమి’ నిర్మాణం పెండింగులో ఉన్నది. సీట్ల సర్దుబాటు జరగవలసి ఉన్నది. అన్నీ కుదురుకుని ‘మహా కూటమి’ జాబితా వెలువడే నాటికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేం. కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే కాంగ్రెస్ పూర్తిగా ఆధారపడుతున్నట్టు ప్రధాన ప్రతిపక్షం వేగాన్ని బట్టి అంచనా వేయక తప్పడం లేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటూనే అందుకు గాను చేయవలసిన పనులేవీ చేయకుండా, పొత్తుల వ్యవహారం పై కదలికలు లేకుండా, గాంధీ భవన్ లో విలేకరుల సమావేశాలతో కాలం వెళ్ళదీసినటిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ ను పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో రెండు రోజుల పర్యటన ముగిసి నెల రోజులు గడచిపోయాయి. టిపిసిసి మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉన్నది. తెలంగాణ రాజకీయమంతా గత నాలుగున్నర సంవత్సరాలుగా ‘రివర్స్’ లో నడుస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం వలె ‘ప్రో యాక్టివు’ గా పనిచేస్తున్నది. ప్రతిపక్షం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నది. బస్సుయాత్రలు రెండు మూడు ‘ట్రిప్పుల’ వల్ల కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కొంత ఉత్సాహం వచ్చిన మాట నిజమే. ఆ ఊపును సజీవంగా ఉంచడంలో విఫలం కావడం ఉత్తమ్ స్వయంకృతాపరాధమని కొందరు కాంగ్రెస్ ప్రముఖులే అంటున్నారు. టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి వంటి ‘షార్ప్ షూటర్’ కు పార్టీలో ప్రాధాన్యం లేదు. తగిన పదవి ఇంకా ఇవ్వలేదు. ఆయనను చాలామంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తమ నియోజకవర్గాలకు రావాలని, ప్రచారం చేయాలని వినతులు వస్తున్నవి. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వివిధ నియోజకవర్గాల నుంచి. జిల్లాల నుంచి వచ్చిన ఆశావహులు, పార్టీ నాయకుల సందడి నెలకొంటున్నది. వందలాది మంది కార్యకర్తలు రేవంత్ మద్దతు కోరుతున్నారు. ఆయన సహకారాన్ని ఆశిస్తున్నారు. టికెట్ల విషయంలో తమ గురించి ఒక మాట చెప్పాలని కోరుతున్నారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం ను కలవవలసిందిగాఅఆశావహులకురేవంత్నచ్చజెపుతున్నారు. తాను కాంగ్రెస్ లో కొత్తగా చేరిన వ్యక్తినని పార్టీ అధిష్టానం, టిపిసిసి మాత్రమే అభ్యర్థుల వడపోత, ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారని రేవంత్ సున్నితంగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఇల్లు ఆశావహులతో, పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడుతున్న సంగతి కాంగ్రెస్ దిగ్గజాలకు మింగుడుపడనిది. అయితే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్’ప్రధాన ప్రచారకర్త’ . స్టార్ క్యాంపెయినర్. ప్రజలు రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా ఆమోదిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను అన్ని ప్రాంతాలకు ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన సమర్ధతను తగిన విధంగా వాడుకోకపోతే కాంగ్రెస్ కె నష్టం. రేవంత్ రెడ్డికి జరిగే నష్టమేమీ లేదు. తన సిట్టింగ్ సెగ్మెంటు కొడంగల్ ను తాను నిలబెట్టుకోగలనన్న ధీమా ఆయనకు ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబర్ 2 నాడే లాంఛనంగా ఎన్నికల సమర శంఖం పూరించారు. 105 మంది అభ్యర్థుల జాబితాను సెప్టెంబరు 6 న సాహసోపేతంగా ప్రకటించారు. నూటికి నూటొక్క శాతం 100కు పైగా సీట్లతో రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి టీఆర్‌ఎస్సేనని కేసీఆర్ అంటున్నారు. పార్టీ అభ్యర్థులకు ఆ భరోసా కల్పిస్తున్నారు. పలు చోట్ల అసమ్మతి జ్వాలలు మిన్నంటినా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్’అసంతృప్త జీవులను’ పిలిపించి మాట్లాడుతున్నారు. ఫోన్ లో బుజ్జగిస్తున్నారు. ఇతర పదవుల ఆశ జూపుతున్నారు. కొందరు సంతృప్తి చెందుతున్నారు. సంతృప్తి కలగని కొందరు రెబెల్ అభ్యర్థులుగా బరిలో ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. కానీ అందులో ఎంతమంది చివరిదాకా మాట మీద నిలబడగలరో,రెబెల్ గా బరిలో ఉండగలరో ఇప్పుడే చెప్పడం కష్టం. ఇక ప్రధాన ప్రతిపక్షం కన్నా బిజెపి కార్యకలాపాలు ముమ్మరమవుతున్నట్టుకనిపిస్తున్నది. ‘మార్పు కోసం శంఖారావం’ పేరిట శనివారం మహాబూబ్ నగర్ లో జరిగిన బహిరంగసభ ఆ పార్టీకి బూస్టింగ్అవుతున్నది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కదనకుతూహలంతో చేసిన వ్యాఖ్యలు ముచ్చట గొల్పుతున్నవి.