అభ్యర్థుల ‘మార్పు’!! కొంచెం ఇష్టం -కొంచెం కష్టం.

105 మంది అభ్యర్థుల ‘జంబో’ జాబితా ప్రకటన వెనుక కేసీఆర్ ఆత్మవిశ్వాసం ఉన్నది. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నా వారి పట్ల ప్రజల్లో ఉండే ‘వ్యతిరేకత’ను తన ‘ఫాక్టర్’ ఓవర్ టేక్ చేయగలదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. పార్టీ అభ్యర్థుల మార్పు గురించి వస్తున్న వార్తలను అధికారికంగా టిఆర్ఎస్ నాయకత్వం ఖండించడం లేదు. మార్పు ఉండదనడం లేదు. మార్పు ఉంటుందనీ చెప్పడం లేదు. ” ఆ విషయం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పరిధిలోనిది” అని మంత్రి కేటీఆర్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వులలో స్పష్టం చేస్తున్నారు. టిఆర్ఎస్ అసంతృప్తులను బుజ్జగించడం, వారిని సముదాయించడం, మళ్ళీ అధికారంలోకి రాగానే ఇవ్వనున్న పదవులపై హామీలు… వంటి కార్యక్రమాలన్నీ కేటీఆర్ చేతుల మీదుగా జరుగుతున్నవి. గతంలో ఇలాంటి సన్నివేశాలలో మంత్రి హరీష్ రావు కనిపించేవారు. కేసీఆర్ దూతగా ఆయన ఇలాంటి అసమ్మతి కార్యకలాపాలకు చెక్ పెట్టె చర్యలు, బుజ్జగించి దారికి తీసుకొని వచ్చే కార్యక్రమాలు చేపట్టే వారు. కారణాలు ఏవైనా పార్టీ మొత్తం కేటీఆర్ చుట్టూ కేంద్రీకృతమవుతున్నది. ఆయన ఆధీనంలోకి పార్టీ వ్యవహారాలు వెడుతున్నవి. టిఆర్ఎస్ కార్యకలాపాలపై కేటీఆర్ అజమాయిషీ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.

 

ఎస్.కె.జకీర్.

ప్రకటిత 105 అసెంబ్లీ నియోజకవర్గాల టిఆర్ఎస్ అభ్యర్థులలో కొందరిని’మార్చవచ్చు’ననే ప్రచారానికి, ఊహాగానాలకు తెరపడడం లేదు. పలు సెగ్మెంట్లలో సిట్టింగులపై ‘వ్యతిరేకత’ బలంగా ఉన్నది. ఆయా ఎమ్మెల్యేల పనితీరు నాసి రకంగా ఉన్నట్టు ఇదివరకే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు తెలుసు. అయితే కేసీఆర్ స్టయిలు వేరు. మిగతా రాజకీయనాయకుల వలె రొటీన్ గా ఉండదు. ఆయన ఒక సారి ఒక నిర్ణయానికి వచ్చారంటే దాన్ని వెనక్కి తీసుకోవడం అత్యంత అరుదు. 105 మంది అభ్యర్థుల ‘జంబో’ జాబితా ప్రకటన వెనుక కేసీఆర్ ఆత్మవిశ్వాసం ఉన్నది. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నా వారి పట్ల ప్రజల్లో ఉండే ‘వ్యతిరేకత’ను తన ‘ఫాక్టర్’ ఓవర్ టేక్ చేయగలదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. పార్టీ అభ్యర్థుల మార్పు గురించి వస్తున్న వార్తలను అధికారికంగా టిఆర్ఎస్ నాయకత్వం ఖండించడం లేదు. మార్పు ఉండదనడం లేదు. మార్పు ఉంటుందనీ చెప్పడం లేదు. ” ఆ విషయం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పరిధిలోనిది” అని మంత్రి కేటీఆర్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వులలో స్పష్టం చేస్తున్నారు. టిఆర్ఎస్ అసంతృప్తులను బుజ్జగించడం, వారిని సముదాయించడం, మళ్ళీ అధికారంలోకి రాగానే ఇవ్వనున్న పదవులపై హామీలు… వంటి కార్యక్రమాలన్నీ కేటీఆర్ చేతుల మీదుగా జరుగుతున్నవి. గతంలో ఇలాంటి సన్నివేశాలలో మంత్రి హరీష్ రావు కనిపించేవారు. కేసీఆర్ దూతగా ఆయన ఇలాంటి అసమ్మతి కార్యకలాపాలకు చెక్ పెట్టె చర్యలు, బుజ్జగించి దారికి తీసుకొని వచ్చే కార్యక్రమాలు చేపట్టే వారు. కారణాలు ఏవైనా పార్టీ మొత్తం కేటీఆర్ చుట్టూ కేంద్రీకృతమవుతున్నది. ఆయన ఆధీనంలోకి పార్టీ వ్యవహారాలు వెడుతున్నవి. టిఆర్ఎస్ కార్యకలాపాలపై కేటీఆర్ అజమాయిషీ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.మరో వైపు పలువురు మంత్రులతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా సమావేశాలు సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటున్నారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల మంత్రులతో కేసీఆర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఆయన ‘మదింపు’ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల ప్రచారం తీరుపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల పట్ల ప్రజల్లో ఉన్న స్పందన, వ్యతిరేకత, అసమ్మతి తదితర విషయాలను కేసీఆర్ తెలుసుకున్నారు. పలువురు పార్టీ అభ్యర్థులకు సీఎం నేరుగా ఫోన్లు చేస్తూ పార్టీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయవలసిన అవసరముందని గుర్తు చేస్తున్నారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఆ షెడ్యూల్ మాత్రం విడుదల చేయలేదు. 100 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు జరిపి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనదేనని కూడా కెసిఆర్ అంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాలలో అసమ్మతి కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నవి. అటు కాంగ్రెస్ సారథ్యంలో ‘కూటమి’ ఇంకా ఏర్పాటు కాలేదు. కూటమి అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత, సొంత పార్టీలో తిరుగుబాట్లు, ఆసమ్మ్మతిచల్లారిన అనంతరమే తదుపరి ప్రచార సభలకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ భావిస్తుండవచ్చును. అసమ్మతి కార్యకలాపాలను పూర్తిగా తుంచివేయగలనని, ఆ విషయాన్ని తనకు విడిచిపెట్టాలని పార్టీ అధ్యక్షుడు కోరుతున్నారు. కొంతమంది అభ్యర్థులను ఇప్పుడు మార్చితే అవతల కాంగ్రేస్ కూటమి జాబితా వెల్లడి కానందున వారు అటువైపు’దూకే’ అవకాశాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ‘అనుమానాస్పద’ అభ్యర్థులపై ఆయన ప్రగతిభవన్ నుంచే ఓ కన్నేసి ఉంచినట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ‘కాంగ్రెస్ కుటమి’ అభ్యర్థుల ఖరారు అనంతరమే కేసీఆర్ ‘విశ్వరూపం’ బయటపడవచ్చునన్నది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం.