ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి!

ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులు మృతి!

జమ్ము కశ్మీర్‌ :

జమ్ము కశ్మీర్‌లో భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. బుద్‌గామ్‌, సోఫియాన్‌లలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు తీవ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. దాడి జరిగిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతులు షంసుల్‌ హక్‌ మేంగ్‌నూ, అమీర్‌ సోహైల్‌ భట్‌, సోహైబ్‌ అహ్మద్‌ షాలుగా గుర్తించారు. పోలీసుల రికార్డుల ప్రకారం వీరందరూ తీవ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన వారుగా తెలుస్తోంది.