వైరల్ వీడియో: నయాగరా హిమపాతం

వైరల్ వీడియో: నయాగరా హిమపాతం

null

నయాగరా.. ఈ పేరు వినగానే హోరెత్తించే పరవళ్లతో అంతెత్తు నుంచి కిందికి దూకే అందమైన జలపాతం కళ్ల ముందు కదలాడుతుంది. కానీ ఇప్పుడు నయాగరా దగ్గర ఆ పరిస్థితి లేదు. అక్కడ రక్తం గడ్డ కట్టేంతగా విపరీతమైన చలి వణికిస్తోంది. ఆ చలికి నయాగరా జలపాతాలు కొన్ని చోట్ల గడ్డ కడుతున్నాయి.

శీతాకాలం హిమపాతం మధ్య పశ్చిమ ఉత్తర అమెరికాను పూర్తిగా మంచు దుప్పటిలో కప్పేసింది. ఈశాన్య ప్రాంతాన్ని పూర్తిగా గడ్డ కటించేసింది. ఇప్పుడు నయాగరా జలపాతంలోని నీటిని కొన్ని ప్రాంతాల్లో ఆపేస్తోంది.

నయాగరా జలపాతాలను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలి వెళ్లిన పర్యాటకులకు పరవళ్లు తొక్కే నీటికి బదులు అంతటా తెల్లగా గడ్డకట్టిన మంచు, కదలకుండా నిలిచిన నీళ్లు కనిపిస్తున్నాయి. అపురూపమైన ఈ అద్భుత దృశ్యాలను అంతా కెమెరాలో బంధించారు.

ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ఎముకలు వణికించే చలిగాలులు ఈ వారమంతా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. న్యూ ఇంగ్లాండ్ లో -5 నుంచి -20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ఈ వారాంతానికి మరోసారి శీతల గాలులు వీస్తాయని చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో రెండు వారాల పాటు తప్పక పోవచ్చని అంటున్నారు.