మూడుతరాల ముచ్చట.

మూడుతరాల ముచ్చట.
Lokesh devansh chandrababu

చిత్తూరు:

సంక్రాంతి వేడుకలలో సీఎం చంద్రబాబు, తనయుడు లోకేష్, మనుమడు దేవాంశ్
పులకించిన నారావారిపల్లె.ఇది మూడుతరాల పండుగ ముచ్చట. తండ్రి, తనయుడు, మనుమడు ఒక్క చోట చేరి చేసిన సంక్రాంతి సందడి. తరాతరాల తెలుగు లోగిళ్ల సంప్రదాయాన్ని కొనసాగించిన ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడిని చూసి నారావారిపల్లె పులకరించింది. సంక్రాంతి సందర్భంగా గ్రామ దేవత సత్యమ్మకు పూజలు చేశారు. అక్కడి నుంచి అరకిలోమీటర్ దూరం నడిచి వెళ్లి కుల దేవత నాగలమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మనుమడు దేవాంశ్ ని ఎడ్లబండిపై ఎక్కించుకుని..ముఖ్యమంత్రి తానే స్వయంగా బండిని తోలుతూ ఊరంతా చూపించారు. తనను చూసేందుకు వచ్చిన వేలాదిమందిని పలకరించారు. వినతులు స్వీకరించారు. దేశ విదేశాలలో ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండుగకు తాను పుట్టిన ఊరు నారావారిపల్లెకు తప్పనిసరిగా హాజరయ్యే సీఎం చంద్రబాబు… తనయుడు, మనుమడు కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించేలా వారిని తీర్చిదిద్దారు.అల్లుడు నారా లోకేష్ ట్రాక్టర్ నడుపగా మామ బాలయ్య, మనుమడు దేవాంశ్ ట్రక్కులో నిలుచుని అందరికీ అభివాదం చేశారు. కనుమ సందర్భంగా బుధవారం పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాక్టర్ ని నారావారిపల్లె వీధిలో నడిపారు. ఈ యేడాది సంక్రాంతి వేడుకలలో నారా వారి మూడుతరాల ప్రతినిధులు చేసిన సందడి చూసి నారావారిపల్లె పులకించింది. పండుగ వేడుకలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ కుమార్తెలు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, తనయుడు రామకృష్ణవారి కుటుంబ సభ్యులు, హీరో నారా రోహిత్ తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.