‘ముందస్తు’ ఎన్నికలపై రేపు విచారణ.

న్యూఢిల్లీ:
తెలంగాణ ముందస్తు ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై శుక్రవారం విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ముందస్తు ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై హైకోర్టు కు వెళ్లాలని పిటిషనర్లను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులో విచారణ జరగనుంది.